కువైట్ లో వర్షం.. హజార్డ్ లైట్ల వినియోగంపై హెచ్చరిక..!!

- October 29, 2026 , by Maagulf
కువైట్ లో వర్షం.. హజార్డ్ లైట్ల వినియోగంపై హెచ్చరిక..!!

కువైట్: వర్షం కురుస్తున్న సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వాహనం నడుపుతున్నప్పుడు హజార్డ్ లైట్లను నిరంతరం ఆన్‌లో ఉంచవద్దని కువైట్ ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు. ఇలా చేయడం వల్ల ఇతర డ్రైవర్లు వాహనం మలుపు తిరుగుతోందా, లేన్ మారుస్తోందా అనే విషయాలను గుర్తించడం కష్టమవుతుందని తెలిపారు. అదే విధంగా తడిగా ఉన్న రహదారులపై వాహన నియంత్రణ, విజిబిలిటీ తగ్గే ప్రమాదం ఉంటుందని ఆపరేషన్స్ అండ్ ట్రాఫిక్ విభాగంలోని ట్రాఫిక్ అవగాహన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బు హసన్ సూచించారు.

తరచూ వాహనాల టైర్ల పరిస్థితిని తనిఖీ చేసుకోవాలని, విండ్‌షీల్డ్ వైపర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలని సూచించారు. అద్దాలపై ఆవిరి పేరుకుపోకుండా డీఫాగర్లను ఉపయోగించాలని చెప్పారు. వర్షంలో వాహనాలు నడిపేటప్పుడు ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటించాలని, వేగాన్ని నియంత్రించుకోవాలని సూచించారు.

మరోవైపు, ప్రధాన రహదారులపై కొనసాగుతున్న మరమ్మతు పనుల కారణంగా కువైట్ సిటీకి వెళ్లే మార్గాల్లో ఉదయం వేళ ట్రాఫిక్ రద్దీ పెరిగిందని బు హసన్ తెలిపారు. నాలుగో రింగ్ రోడ్డుపై పనుల కారణంగా వాహనదారులు ఐదో రింగ్ రోడ్డును ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగిస్తుండటంతో అక్కడా రద్దీ ఎక్కువైందని వివరించారు.

వాహనదారులు ట్రాఫిక్ పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారం కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ఛానళ్లలో వచ్చే ప్రకటనలను గమనించాలని సూచించారు. ముఖ్యంగా ఉదయం రద్దీ వేళల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించుకోవచ్చని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com