నాటో చీఫ్, యూరప్ రక్షణ మంత్రులతో సౌదీ చర్చలు..!!
- October 30, 2026
రియాద్: ప్రాంతీయ భద్రత, రక్షణ సహకారంపై సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో టెలిఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మిడిలిస్టులో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో సైనిక, రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరువురు చర్చించారు.
ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన ఉమ్మడి చర్యలపై చర్చించినట్లు సౌదీ వర్గాలు వెల్లడించాయి. పరస్పర ఆసక్తి ఉన్న ఇతర అంశాలను కూడా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, కెనడా రక్షణ మంత్రి డేవిడ్ మెక్‌గింటీ, జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్, స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీటా రోబ్లెస్‌తోనూ ప్రిన్స్ ఖాలిద్ ఫోన్‌లో మాట్లాడారు. సౌదీ అరేబియాపై హౌతీ దాడులను ఖండించిన నేపథ్యంలో తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.
ఈ మూడు దేశాలతో కలిసి ప్రాంతీయ పరిస్థితులకు స్పందించే విధానాలు, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడేందుకు ఉమ్మడి చర్యలను బలోపేతం చేసే మార్గాలపై చర్చలు జరిగాయి. అలాగే ఆయా దేశాలతో ద్వైపాక్షిక సైనిక, రక్షణ సంబంధాలు, భవిష్యత్తులో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలను సమీక్షించారు. కెనడా రక్షణ మంత్రితో జరిగిన సంభాషణలో అల్బెర్టా ప్రావిన్స్‌లోని సైనిక స్థావరంలో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు సైనిక సిబ్బంది మరణించడంపై ప్రిన్స్ ఖాలిద్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఒమన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసించింది ఫ్రాన్స్..!!
- గ్లోబల్ విలేజ్‌లో 700 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన..!!
- ఖతార్ నేషనల్ థియేటర్ రెనోవేషన్ పనులు ప్రారంభం..!!
- కువైట్‌లో డెలివరీ బైక్‌లపై ప్రత్యేక తనిఖీలు..!!
- డిజిటల్ పార్లమెంటరీ సదస్సుకు బహ్రెయిన్ సిద్ధం..!!
- నాటో చీఫ్, యూరప్ రక్షణ మంత్రులతో సౌదీ చర్చలు..!!
- తిరుపతి సహా 11 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ..కేంద్రం కీలక నిర్ణయం
- యూఏఈ ఫ్లాగ్ డే దినోత్సవం.. గ్లోబల్ విలేజ్‌లో 700 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన!
- ఏపీ, తెలంగాణలో ఓటర్ల తుది జాబితా ఎప్పుడంటే? ఈసీ కొత్త షెడ్యూల్
- ఖతార్ బెలూన్ ఫెస్టివల్ వాయిదా..!!







