ఒమన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసించింది ఫ్రాన్స్..!!
- October 30, 2026
మస్కట్: ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఒమన్ చేస్తున్న ప్రయత్నాలను ఫ్రాన్స్ ప్రశంసించింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హార్తీతో ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సంబంధాలు, వ్యూహాల డైరెక్టర్ జనరల్ గియోమ్ ఒల్లానియర్ భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ప్రాంతంలో వేగంగా మారుతున్న పరిణామాలతో పాటు ఇరు దేశాలకు సంబంధించిన పలు ఉమ్మడి అంశాలపై చర్చించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు, వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు ఒమన్ చేస్తున్న కృషిని ఫ్రాన్స్ అధికారి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ విషయంలో ఒమన్ పోషిస్తున్న సానుకూల పాత్రను తమ దేశం అభినందిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసించింది ఫ్రాన్స్..!!
- గ్లోబల్ విలేజ్‌లో 700 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన..!!
- ఖతార్ నేషనల్ థియేటర్ రెనోవేషన్ పనులు ప్రారంభం..!!
- కువైట్‌లో డెలివరీ బైక్‌లపై ప్రత్యేక తనిఖీలు..!!
- డిజిటల్ పార్లమెంటరీ సదస్సుకు బహ్రెయిన్ సిద్ధం..!!
- నాటో చీఫ్, యూరప్ రక్షణ మంత్రులతో సౌదీ చర్చలు..!!
- తిరుపతి సహా 11 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ..కేంద్రం కీలక నిర్ణయం
- యూఏఈ ఫ్లాగ్ డే దినోత్సవం.. గ్లోబల్ విలేజ్‌లో 700 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన!
- ఏపీ, తెలంగాణలో ఓటర్ల తుది జాబితా ఎప్పుడంటే? ఈసీ కొత్త షెడ్యూల్
- ఖతార్ బెలూన్ ఫెస్టివల్ వాయిదా..!!







