ప్రభుదేవా పేరిట యాప్ ..

- August 27, 2016 , by Maagulf
ప్రభుదేవా పేరిట యాప్ ..

ఇటు హీరోగా అటు కొరియోగ్రాఫర్ గా, మరో వైపు దర్శకుడిగా ఇలా అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోను ప్రభుదేవాకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ హీరో నటించిన, తీసిన సినిమాలకు మంచి ఆదరణ లభించడంతో ప్రభుదేవాకి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభుదేవా అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వాల్యూ ని ప్రభుదేవా కూడా బాగానే ఉపయోగించుకుంటున్నాడు. తాజాగా ప్రభుదేవా పేరిట యాప్ రావడం విశేషం. ప్రభుదేవా.కామ్ అనే వెబ్ సైట్ నుంచి ఆ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం ఉండగా అందులో ప్రభుదేవాకు సంబంధించి అరుదైన ఫొటోలు, పాటలు అన్ని ఉంటాయట. ఇంక ప్రభుదేవా చేయబోయే సినిమాల అప్ డేట్స్ కూడా తెలుసుకోవచ్చు.ఇంక ఈ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ రిహార్సల్స్ తో పాటు కొన్ని ప్రత్యేకమైన వీడియోలు కూడా అందుబాటులో ఉంచుతాడట. ప్రభుదేవా కెరీర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చట. ప్రస్తుతం ఈ యాప్ కి మంచి రెస్పాన్స్ వస్తోండడంతో ప్రభుదేవా సంతోషం వ్యక్తం చేశాడు ప్రభుదేవా. రానున్న రోజుల్లో ఈ యాప్ డౌన్ లోడ్స్ జోరుగా సాగుతాయని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com