గడువు తేదీల్లో అక్రమ మార్పులు.. 27 మంది అరెస్ట్..!!
- October 31, 2026
కువైట్: దిగుమతి చేసుకున్న చేపల ఉత్పత్తి తేదీలు, గడువు తేదీలను అక్రమంగా మార్చి విక్రయిస్తున్న ముఠాపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో 27 మందిని అరెస్ట్ చేయడంతో పాటు, 16 కూలింగ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నకిలీ గడువు తేదీలతో ఉన్న 894 చేపల బాక్సులను గుర్తించారు. ఈ వివరాలను వెల్లడించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వాణిజ్య మోసాలను అరికట్టడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ అరెస్టులు చేసినట్లు తెలిపింది.
జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ పరిధిలోని కౌంటర్‌ఫీటింగ్ అండ్ ఫోర్జరీ క్రైమ్స్ విభాగం ఈ అక్రమాలను గుర్తించింది. దిగుమతి చేసుకున్న చేపల బాక్సులపై ముద్రించిన ఉత్పత్తి, గడువు తేదీలను తొలగించి.. తప్పుడు వివరాలతో కొత్త లేబుళ్లు తయారు చేసి అతికిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ విధంగా చేపల నిల్వ గడువును పెంచి రెస్టారెంట్లు, కంపెనీలు, దుకాణాలకు సరఫరా చేయాలని నిందితులు భావించినట్లు అధికారులు తెలిపారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతితో ప్రత్యేక బృందాలు సెంట్రల్ ఫిష్ మార్కెట్‌పై దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా 16 శీతలీకరణ వాహనాలు, 894 చేపల బాక్సులతో పాటు నకిలీ లేబుళ్లను తయారు చేసి ప్రింట్ చేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన 27 మందితో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈకి వెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..!!
- హార్ముజ్ లో గాయపడిన భారతీయుడు మస్కట్‌కు తరలింపు..!!
- కెన్యాకు ప్రయాణంపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులపై కొత్త నిబంధనలు?
- ఖతార్ రియల్ ఎస్టేట్‌లో మారుతున్న ఇన్వెస్టర్ల ధోరణి..!!
- గడువు తేదీల్లో అక్రమ మార్పులు.. 27 మంది అరెస్ట్..!!
- సౌదీ వెళ్లేవారికి అలర్ట్.. నవంబర్ 14 వరకు ఎయిరిండియా సర్వీసులు రద్దు!
- ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
- TANA ప్రపంచ సాహిత్య వేదిక 97వ సమావేశం విజయవంతం







