22 మంది పార్లమెంట్‌ సభ్యులను నియమించిన పాక్

- August 27, 2016 , by Maagulf
22 మంది పార్లమెంట్‌ సభ్యులను నియమించిన పాక్

కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తడానికి పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ 22 మంది పార్లమెంట్‌ సభ్యులను నియమించారు. ఆక్రమిత కశ్మీర్‌లో భారత అకృత్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు తదితర సమస్యలను ప్రత్యేక రాయబారులుగా వీరు ప్రపంచం దృష్టికి తీసుకువెళ్తారని షరీఫ్‌ చెప్పారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీర్‌ కోసం పోరాటం చేసేందుకు వీరిని పంపించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
'ప్రత్యేక రాయబారులైన ఈ బృందానికి పాక్‌ ప్రజల బలంతోపాటు నియంత్రణ రేఖ వెంబడి కశ్మీరీ ప్రజల ప్రార్థనలు, ప్రభుత్వ మద్దతు ఉంటుంది.

ఈ బృందం వెనుక నేను ఉండి కశ్మీర్‌ కోసం వారు చేస్తున్న కృషిని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చేస్తాను. ఈ సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో నా ప్రసంగంలో వీటిని ప్రస్తావిస్తాను' అని షరీఫ్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com