బహ్రెయిన్‌లో భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం..!!
- November 01, 2026
మనామా: బహ్రెయిన్‌లో జరుగుతున్న గేట్‌వే గల్ఫ్ 2026 సదస్సు ద్వారా $20 బిలియన్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ఆర్థిక, జాతీయ ఆర్థిక వ్యవహారాల మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో 110కి పైగా ఒప్పందాలు కుదరనున్నట్లు తెలిపారు. మనామాలో సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఒప్పందాల ద్వారా కొత్త పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు, ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గల్ఫ్ ప్రాంత ఆర్థిక భవిష్యత్తుకు బహ్రెయిన్ కీలక ప్రవేశద్వారంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
సవాళ్లను ఎదుర్కొన్నా వెనక్కి తగ్గని గల్ఫ్
గల్ఫ్ ప్రాంతం ఎన్నడూ లేనంతటి సవాళ్లు, అపూర్వమైన దాడులను ఎదుర్కొందని షేక్ సల్మాన్ తెలిపారు. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. సాధించిన ప్రగతిని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్ తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. గల్ఫ్ దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సుమారు $2.4 ట్రిలియన్లకు చేరుకుందని వెల్లడించారు. బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థలో చమురేతర రంగాల వాటా 86 శాతానికి పైగా ఉండగా, మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఇది 77 శాతానికి మించిందని వివరించారు. అలాగే గల్ఫ్ దేశాల సార్వభౌమ సంపద నిధులు (Sovereign Wealth Funds) $5 ట్రిలియన్లకు పైగా పెట్టుబడులను నిర్వహిస్తున్నాయని తెలిపారు.
పెట్టుబడిదారులకు మూడు ప్రధాన ప్రాధాన్యతలు
పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పష్టమైన, ఆధునిక నిబంధనలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులపై బహ్రెయిన్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి వివరించారు. లాజిస్టిక్స్, రవాణా అనుసంధానం, డిజిటల్ నెట్‌వర్క్‌లు, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధితో పాటు నైపుణ్యం కలిగిన యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. ఫైనాన్స్, లాజిస్టిక్స్, పర్యాటకం, తయారీ, సాంకేతిక పరిజ్ఞానం, చమురు, గ్యాస్ రంగాల్లో దేశీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. గేట్‌వే గల్ఫ్ సదస్సు ఏటా విస్తరిస్తోందని, ఇందులో పాల్గొంటున్న ప్రముఖ పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తల నిర్ణయాలు సదస్సు ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని షేక్ సల్మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 10 నెలల్లో 48,950 మందికి జరిమానాలు..!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు..!!
- కువైట్‌లో కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న సంస్థపై దాడి..!!
- ఒమన్‌లో జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం..!!
- ఖతార్‌లో ఉద్యోగం మానేస్తే.. ఫైనల్ సెటిల్మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారు?
- కాంగోను వణికిస్తున్న ‘ఎబోలా’.. 5వేలకు పైగా మరణాలు
- దుబాయ్ రైడ్ 2026 విజయవంతం.. షేక్ జాయెద్ రోడ్డు పై సైక్లిస్టుల సందడి
- సౌదీ అరేబియా కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..!!
- యూఏఈ లాటరీ తాజా విజేతలు.. ముగ్గురికి తలా Dh100,000..!!







