కువైట్లో కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న సంస్థపై దాడి..!!

- November 01, 2026 , by Maagulf
కువైట్లో కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న సంస్థపై దాడి..!!

కువైట్: ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన కుళ్లిన మాంసం, చేపలను విక్రయిస్తున్న ఓ ఆహార సంస్థపై అధికారులు చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా మొత్తం 3 టన్నుల 548 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సదరు సంస్థను మూసివేయాలని ఆదేశించారు. జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌తో కలిసి ఈ దాడులు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాని కుళ్లిన మాంసం, చేపలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా చేపల గడువు తేదీలను మార్చడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను నిల్వ చేయడం, విక్రయించడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో అధికారులు సంబంధిత సంస్థపై ఉల్లంఘన కేసులు నమోదు చేసి, దుకాణాన్ని మూసివేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తనిఖీలు, నిఘా చర్యలను మరింత కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com