దుబాయ్‌లో 10 నెలల్లో 48,950 మందికి జరిమానాలు..!
- November 01, 2026
యూఏఈ : దుబాయ్‌లో వాహన రిజిస్ట్రేషన్ గడువు ముగిసినప్పటికీ వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు భారీగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మొదటి 10 నెలల్లో గడువు ముగిసిన రిజిస్ట్రేషన్‌తో వాహనాలు నడిపినందుకు మొత్తం 48,950 ఉల్లంఘనలను దుబాయ్ పోలీసులు నమోదు చేశారు. వాహన రిజిస్ట్రేషన్‌ను సకాలంలో రెన్యువల్ చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ రెన్యువల్ సమయంలో నిర్వహించే సాంకేతిక తనిఖీల ద్వారా వాహనాల్లోని లోపాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.
దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ మాట్లాడుతూ.. వాహనాలు రోడ్లపై సురక్షితంగా ప్రయాణించాలంటే క్రమం తప్పకుండా తనిఖీలు చేయించుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు. ముఖ్యంగా టైర్లు, బ్రేకులు, లైట్లు, స్టీరింగ్ వ్యవస్థల పనితీరును పరిశీలించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ భాగాల్లో సమస్యలు ఉంటే ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా వాహనం మొరాయించి ప్రమాదాలకు దారితీయవచ్చని తెలిపారు. అంతేకాకుండా వాహన బీమా గడువు కూడా ముగిసినట్లయితే ప్రమాదం జరిగినప్పుడు అదనపు ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు.
జరిమానా Dh500.. 4 బ్లాక్ పాయింట్లు
యూఏఈ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన రిజిస్ట్రేషన్‌తో వాహనం నడిపితే Dh500 జరిమానాతో పాటు 4 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. అంతేకాకుండా వాహనాన్ని 7 రోజుల పాటు సీజ్ చేస్తారు. కాబట్టి వాహనదారులు రిజిస్ట్రేషన్ గడువు, బీమా గడువులను ముందుగానే తనిఖీ చేసుకుని సకాలంలో రెన్యువల్ చేయించుకోవాలని దుబాయ్ పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 10 నెలల్లో 48,950 మందికి జరిమానాలు..!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు..!!
- కువైట్‌లో కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న సంస్థపై దాడి..!!
- ఒమన్‌లో జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం..!!
- ఖతార్‌లో ఉద్యోగం మానేస్తే.. ఫైనల్ సెటిల్మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారు?
- కాంగోను వణికిస్తున్న ‘ఎబోలా’.. 5వేలకు పైగా మరణాలు
- దుబాయ్ రైడ్ 2026 విజయవంతం.. షేక్ జాయెద్ రోడ్డు పై సైక్లిస్టుల సందడి
- సౌదీ అరేబియా కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..!!
- యూఏఈ లాటరీ తాజా విజేతలు.. ముగ్గురికి తలా Dh100,000..!!







