సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు..!!

- November 01, 2026 , by Maagulf
సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు..!!

జెడ్డా: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. దట్టమైన పొగమంచుతో పాటు మోస్తరు నుంచి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉండటంతో రెండు రెడ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇదే ప్రాంతంలోని మరికొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్‌లు ప్రకటించింది. అలాగే నార్తర్న్ బోర్డర్స్, హాయిల్, మక్కా, అసీర్, అల్ బాహా, జజాన్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.

ఆదివారం వాతావరణ అంచనా ప్రకారం జజాన్, అసీర్, అల్ బాహా, మక్కా, మదీనా, హాయిల్, నార్తర్న్ బోర్డర్స్ ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడవచ్చని తెలిపింది. ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే సమయంలో రియాద్, అల్ ఖాసిమ్ సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచి దుమ్ము, ఇసుక తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉష్ణోగ్రతల విషయానికి వస్తే దమ్మామ్‌లో అత్యధికంగా 38°C నమోదయ్యే అవకాశం ఉంది. మక్కాలో 37°C, రియాద్, జెడ్డా, బురైదాలో 36°C, మదీనా, జజాన్‌లో 35°C ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చు. అలాగే హాయిల్‌లో 31°C, నజ్రాన్‌లో 30°C, సకాకాలో 29°C, తబుక్‌లో 28°C, అరార్‌లో 27°C, అబాలో 25°C, అల్ బాహాలో 23°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com