బ్రిటన్‌కు ఐసిస్ నుంచి భారీ ముప్పు - నిఘావర్గాలు
- August 27, 2016
బ్రిటన్‌కు ఐసిస్ నుంచి భారీ ముప్పు పొంచిఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారీగా నకిలీ పాస్ పోర్టులు వినియోగిస్తున్న విషయాన్ని గుర్తించిన తర్వాత ఈ హెచ్చరికలు విడుదలయ్యాయి. ఇటీవల గ్రీస్‌లోని ఓ శరణార్థి శిబిరంలో ఐసిస్ మనుషులు నకిలీ పాస్‌పోర్టులు పంచుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఇక్కడ ఉగ్రవాదులు ఐరోపా మొత్తం సంచరించే అవకాశం కలుగుతుంది.
దీనిపై యూరోపోల్ డైరెక్టర్ రాబ్ వాన్రైట్ మాట్లాడుతూ ఐసిస్ సంస్థ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. నిర్ణీత లక్ష్యాలపై దాడులు నిర్వహించేందుకు బృందాలను పంపిస్తోంది. దీంతో అక్కడ జరిగే యుద్ధంపై నుంచి ప్రపంచం దృష్టి మళ్లించవచ్చనేది దాని వ్యూహం.
దీనిలో భాగంగా శరణార్థుల రూపంలో కొందరు యూరోప్లోకి చొరబడ్డారని చెప్పారు. నవంబర్‌లో పారిస్ దాడిలో పాల్గొన్న వారు కూడా సిరియాకు చెందిన నకిలీ పాస్‌పోర్టులు వినియోగించారన్నారు. పారిస్ తరహా దాడులు జరిగే ప్రమాదం ఉండటంతో దాదాపు 50 బృందాలు ఇప్పటికే సిద్ధంగా పెట్టినట్లు వాన్రైట్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







