'శతమానం భవతి' మూడు తరాల కథ...
- August 27, 2016
శ ర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'శతమానం భవతి'.
అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. వేగేశ్న సతీష్ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.
తొలి సన్నివేశానికి సత్యరంగయ్య క్లాప్‌నిచ్చారు. రంగ యశ్వంత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు మాట్లాడుతూ ''మూడు తరాల కథ ఇది.
పెద్దలు ఆశీర్వదించేటప్పుడు 'శతమానం భవతి' అంటారు. ఆ పదంలోనే ఓ సానుకూల దృక్పథం ఉంది. కుటుంబ ప్రేక్షకులకు, యువతరానికీ నచ్చేలా ఈ కథని సిద్ధం చేశాం. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''జీవితంలోంచి పుట్టిన కథ, సమాజంలోంచి పుట్టుకొచ్చిన పాత్రలే తెరపై కనిపిస్తాయ''న్నారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, ఇంద్రజ, శివాజీరాజా, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









