స్పైస్‌జెట్ ప్రయాణికులు తృటిలో ప్రమాదం...
- August 27, 2016
జబల్‌పూర్ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ ప్రయాణికులు శనివారం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్పైస్‌జెట్ విమానం నుంచి దిగి బస్సులో టెర్మినల్ భవంతి వైపు వెళుతుండగా అక్కడి నుంచి మెల్లగా తరలుతున్న ఎయిరిండియా విమానం రెక్క తగలబోయింది. ఎయిరిండియా విమానం రెక్క ఒకటి బస్సువైపు వస్తుండటాన్ని గమనించిన బస్సులోని ప్రయాణికుల్లో సుమారు 30 మంది భయాందోళనలతో వెలుపలికి దిగేశారు. భారీ విమానరెక్క ఢీకొనకుండా బస్సు తృటిలో తప్పించుకుంది. విమానాశ్రయంలో విమానాలు కదిలేటప్పుడు.....వాటిని నిలిపే చోటికి వెళుతున్నప్పుడు కూడా సురక్షితంగా ఉండేందుకు నిర్దిష్ట దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి.
అయితే, నిలిపి ఉంచే చోటుకు తరలుతున్న ఎయిరిండియా విమానం మాత్రం ఆ ప్రసక్తే లేనట్లుగా ప్రయాణికులున్న బస్సును దాదాపుగా తాకేంత దగ్గర దాకా రావడం స్పష్టంగా చూసినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. దూరం పాటించే విషయంలో ఎయిరిండియా విమానం నిబంధనలను ఉల్లంఘించిందన్నాయి. పైగా, ఈ విషయాన్ని గమనించేందుకు తగిన పర్యవేక్షణ కూడా లోపించిందని పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







