ఒమన్‌లో స్పాంజ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..!!

- November 05, 2026 , by Maagulf
ఒమన్‌లో స్పాంజ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..!!

సలాలా: ఒమన్‌లోని ధోఫార్ గవర్నరేట్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అవ్కాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న స్పాంజ్ తయారీ ఫ్యాక్టరీతో పాటు గోదాములో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. 

గవర్నరేట్‌లోని పలు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ కేంద్రాల సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com