లుసైల్‌లో ఇస్తిస్కా నమాజ్ చేసిన ఖతార్ అమిర్..!!
- November 05, 2026
దోహా: ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ లుసైల్ ప్రార్థనా ప్రాంగణంలో ఇస్తిస్కా నమాజ్ నిర్వహించారు. అల్లాహ్‌ను వర్షం కోసం ప్రార్థించే ప్రవక్త మహమ్మద్ (స) వారి సున్నత్‌ను అనుసరిస్తూ, పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి ఆయన ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
అమిర్ వ్యక్తిగత ప్రతినిధి షేక్ జాసిమ్ బిన్ హమద్ అల్ థానీ, షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ థానీ, షేక్ మహమ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ, షేక్ జాసిమ్ బిన్ ఖలీఫా అల్ థానీ కూడా ఇస్తిస్కా నమాజ్‌లో పాల్గొన్నారు. షూరా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనిమ్‌తో పాటు పలువురు రాజకుటుంబ సభ్యులు, మంత్రులు, షూరా కౌన్సిల్ సభ్యులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ప్రార్థనలు చేశారు.
నమాజ్ అనంతరం జరిగిన ఉపన్యాసంలో షేక్ డాక్టర్ యాహ్యా బట్టి అల్ నుఐమీ మాట్లాడుతూ.. వర్షాలు ఆలస్యం కావడం అనేది మనిషి అల్లాహ్‌పై ఎంతగా ఆధారపడి ఉన్నాడో గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. క్షమాపణ కోరడం, దానధర్మాలు పెంచడం, సత్కార్యాలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. నీరు అల్లాహ్ ప్రసాదించిన అమూల్యమైన వరమని, దాని పట్ల కృతజ్ఞతతో ఉండాలని ఆయన కోరారు. నీటిని పొదుపుగా వినియోగించాలని, వృథా చేయకుండా జాగ్రత్త పడాలని భక్తులకు సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో స్పాంజ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..!!
- ఆహార నిల్వలు పెంచుకోవాలి..కువైట్ సహకార సంఘాలకు ఆదేశం..!!
- లుసైల్‌లో ఇస్తిస్కా నమాజ్ చేసిన ఖతార్ అమిర్..!!
- సీఈసీ, ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన మినహాయింపుపై సుప్రీంకోర్టు నోటీసులు
- మా ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం..అయినా వెనక్కి తగ్గను: డోనాల్డ్ ట్రంప్
- ఉపాధి హామీ పని దినాలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు రిక్వెస్ట్
- మిడిలిస్ట్ లో ఉద్రిక్తతలపై సౌదీ, సిరియా కీలక పిలుపు..!!
- దుబాయ్‌లో అద్దె చెల్లించని వ్యాపారికి షాక్..!!
- లండన్ లో ఒమన్ పర్యాటక ప్రత్యేకతల ప్రదర్శన..!!
- బహ్రెయిన్ – ఇరాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు..!!







