బహ్రెయిన్ విమానాశ్రయ భద్రతా మరింత పటిష్టం..!!
- November 05, 2026
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత పటిష్టం చేసేందుకు బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్ కంపెనీ (BAC), అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ థేల్స్ (Thales) మధ్య ఐదేళ్లపాటు కొత్త ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా విమానాశ్రయంలోని కీలక భద్రతా వ్యవస్థలకు నిరంతర నిర్వహణ, సాంకేతిక సహకారం అందించనున్నారు. గేట్‌వే గల్ఫ్ 2026 సందర్భంగా BAC చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అహ్మద్ మొహమ్మద్ జనాహి, థేల్స్ బహ్రెయిన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుయిలౌమ్ కొల్లెట్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో BAC చైర్మన్ ఖలీద్ తాఖీ పాల్గొన్నారు.
ఒప్పందంలో భాగంగా విమానాశ్రయంలోని సెక్యూరిటీ కెమెరాలు, ప్రవేశ నియంత్రణ వ్యవస్థలు (యాక్సెస్ కంట్రోల్), పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థలు, వాటికి అనుసంధానమైన ఇతర సాంకేతిక పరికరాలకు థేల్స్ సంస్థ నిర్వహణ, సాంకేతిక సేవలు అందిస్తుంది. విమానాశ్రయ భద్రతతో పాటు సమర్థవంతమైన కార్యకలాపాలకు ఎంతో అవసరమని అహ్మద్ మొహమ్మద్ జనాహి పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల ఒప్పందం కీలక వ్యవస్థల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు, విమానాశ్రయ కార్యకలాపాలను సిద్ధంగా ఉంచేందుకు దోహదపడుతుందని తెలిపారు.
అంతర్జాతీయ విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, ప్రయాణికులు, విమానయాన సంస్థలు, వ్యాపార రంగ అవసరాలకు అనుగుణంగా బహ్రెయిన్ విమానాశ్రయ సేవలను మరింత మెరుగుపరచడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ విమానాశ్రయ భద్రతా మరింత పటిష్టం..!!
- సిరియా పునర్నిర్మాణానికి సౌదీ అరేబియా భారీ సాయం..!!
- యూఏఈలో త్వరలో ఎగిరే కార్ల సందడి..!!
- ఒమన్‌లో స్పాంజ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..!!
- ఆహార నిల్వలు పెంచుకోవాలి..కువైట్ సహకార సంఘాలకు ఆదేశం..!!
- లుసైల్‌లో ఇస్తిస్కా నమాజ్ చేసిన ఖతార్ అమిర్..!!
- సీఈసీ, ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన మినహాయింపుపై సుప్రీంకోర్టు నోటీసులు
- మా ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం..అయినా వెనక్కి తగ్గను: డోనాల్డ్ ట్రంప్
- ఉపాధి హామీ పని దినాలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు రిక్వెస్ట్
- మిడిలిస్ట్ లో ఉద్రిక్తతలపై సౌదీ, సిరియా కీలక పిలుపు..!!







