సినిమా రివ్యూ: 'రామాయణ’.!

- November 05, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: \'రామాయణ’.!

దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘రామాయణ’. తెలుగు, హిందీ, కన్నడ భాషల నుంచి ప్రముఖ నటీనటుల్ని ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా  ఎంచుకున్నారు. తెలుగు నుంచి సాయి పల్లవిని, కన్నడ పరిశ్రమ నుంచి యష్‌ని, బాలీవుడ్ నుంచి రణ్‌బీర్ కపూర్‌ మరియు రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇదో పెద్ద ఇతిహాసం. ఈ ఇతిహాసానికి సంబంధించి కథ, కథనాలు అందరికీ తెలిసినవే. అయితే, ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా విజువల్ ఎఫెక్ట్స్ జోడించి ‘రామాయణ’ చిత్రం తెరకెక్కించారు. మరి, అంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాలి.

కథ:

వాస్తవానికి రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విషయానికి వస్తే, రాముడు (రణ్‌బీర్ కపూర్) పుట్టుక, ఆయన బాల్యం, విశ్వామిత్రునితో ఆయన విద్యాభ్యాస ప్రయాణం, మిథిలా నగరంలో శివ ధనుస్సును ఎత్తి, సీత (సాయి పల్లవి) మాతతో స్వయంవరం, వివాహం, వనవాసం.. ఇలా రాముడి ప్రథమ జీవితంలోని కీలక ఘట్టాలపై దర్శకుడు దృష్టి పెట్టారు. వనవాసంలో వుండగా మాయా లేడి రూపంలో మారీచుడి రాక, శూర్పణఖ ఎపిసోడ్.. టచ్ చేశారు. రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకెళ్లిపోవడంతో ఈ మొదటి పార్ట్ ముగించారు. రెండో పార్ట్‌కి భారీ హైప్ అండ్ లీడ్ ఇచ్చి అంచనాల్ని పెంచేశారు. మరి, ఈ మొదటి పార్టులో చూపించిన ఘట్టాలన్నీ అంచనాల్ని అందుకునేలా వున్నాయా.? లేదా.? తెలియాలంటే రామాయణ సినిమాని తెరపై చూడాల్సిందే. 

నటీనటుల పనితీరు:

ఈ సినిమా కాస్టింగ్ విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ అత్యంత వినయం, విధేయత, ధర్మ బద్ధత, ప్రశాంతత, అంతర్గత మధనం.. ఇలాంటి బావోద్వేగాలను చక్కగా పలికించారు తన నటనలో. అయితే, తెలుగు ప్రేక్షకులకు మాత్రం రాముడి పాత్ర అంతగా ఆశించిన రీతిలో ఆకర్షించడం లేదన్న అభిప్రాయాలున్నాయ్. ఇక, సీత పాత్రలో సాయి పల్లవి నేచురల్‌గా కనిపించినప్పటికీ, ఆ పాత్రకున్నంత ప్లెజెంట్ నేచర్‌ని క్యారీ చేయడంలో సాయి పల్లవి కూడా జస్ట్ ఓకే అంటున్నారు. రావణాసురుడి పాత్రలో యష్ భీభత్సం. విశ్వరూపం చూపించేశాడు. ఆ పాత్రకు ఇచ్చిన ఇంట్రో కూడా భారీ స్థాయిలో వుంది. వందకు వంద మార్కులేయించుకున్నాడు రావణుడిగా స్క్రీన్ ప్రెజెన్స్‌లో యష్. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, దశరధుడి పాత్రలో అరుణ్ గోవిల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. ఇతర పాత్రలు ఓకే.

సాంకేతిక వర్గం పనితీరు

ఈ సినిమాని పార్టులు పార్టులుగా విభజించాల్సిన అవసరం వుంది. మొదటి పార్ట్‌లో రామ రావణ యుద్ధం గురించి, హనుమంతుడి గురించి కానీ,  ప్రస్థావనకు చోటివ్వలేదు దర్శకుడు నితీష్ తివారీ. సీతా అపహరణంతో మొదటి పార్ట్‌ని ముగించేశాడు. రెండో పార్ట్‌కి ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అయితే, ఈ మొదటి పార్ట్‌లో స్పృశించిన ఘట్టాలకు ఆడియన్స్ అంచనాలు రీచ్ అవ్వాలంటే తెరపై సన్నివేశానికి తగ్గట్లుగా... అంతకు మించి అనేట్లుగా వుండాలంటే మెయిన్ రోల్ పోషించాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్. ఏ.ఆర్.రెహమాన్ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయారు. పాటలు జస్ట్ ఓకే. బీజీఎమ్ కొన్ని సన్నివేశాల్లో బాగా తేలిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కొన్ని చోట్ల చాలా బాగున్నాయ్. కానీ, కొన్ని చోట్ల మాత్రం విఎఫ్ఎక్స్ ఎఫెక్టులు తేలిపోయాయ్. బ్లూ మ్యాట్ సీన్స్‌లా తెలిసిపోయాయ్. ఇదీ ఓ మైనస్సే ఇంత భారీ బడ్జెట్ చిత్రానికి. మాటలు ఓకే. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయ్. మైనస్‌లు చాలానే వున్నప్పటికీ ఈ విజువల్ వండర్‌ని ఒకసారి ధియేటర్లో ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. కానీ, రామాయణ ఇతిహాసాన్ని బ్యాలెన్స్ చేయగల దృశ్య కావ్యం అయితే ఈ సినిమా కాలేదు. 

ప్లస్ పాయింట్స్:

యష్ పర్‌ఫామెన్స్, విజువల్ ఎఫెక్ట్స్,. క్లైమాక్స మరియు సెకండ్ పార్ట్‌కి ఇచ్చిన ఇంట్రెస్టింగ్ లీడ్..

మైనస్ పాయింట్స్:
తెలిసిన కథ,  నెమ్మదించిన కథనం, తేలిపోయిన అతి కీలకమైన ఘట్టాలు, అస్సలు పండని భావోద్వేగాలు, టార్చ్‌లైట్ వేసినా దొరకని దైవత్వం, 

చివరిగా:

ప్లస్, మైనస్.. ఎలా వున్నా.. తెరపై ఖచ్చితంగా చూడాల్సిన ఓ విజువల్ వండర్ ‘రామాయణ’. తప్పక తెరపై చూడాల్సిందే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com