కువైట్ విమానాశ్రయంలో కొత్త ఆంక్షలు..!!
- November 06, 2026
కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం, లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించడంపై పౌర విమానయాన శాఖ (DGCA) కొత్త ఆంక్షలు విధించింది. విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులు, అక్కడ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఈ మేరకు పౌర విమానయాన శాఖ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ సాద్ అల్ ఒతైబీ 2026లో సర్క్యులర్ నంబర్ 60ను జారీ చేశారు. దీని ప్రకారం విమానాశ్రయంలో తమకు కేటాయించిన పని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు, కెమెరాలు లేదా ఇతర సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం, ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించడంపై నిషేధం విధించారు.
ఈ ఆంక్షలు విమానాల పార్కింగ్ ప్రదేశాలు (అప్రాన్లు), ప్రయాణికుల టెర్మినళ్లు, పరిపాలనా భవనాలు, సాంకేతిక విభాగాల భవనాలు సహా పౌర విమానయాన శాఖకు చెందిన అన్ని కార్యాలయాలు, ఇతర సౌకర్యాలకు వర్తిస్తాయి. అంతేకాకుండా విమానాశ్రయానికి సంబంధించిన అంతర్గత పత్రాలు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలను ఫొటోలు తీయడం లేదా ప్రచురించడం కూడా నిషేధించారు. భద్రతా విధానాలు, భద్రతా వ్యవస్థలు, తనిఖీ కేంద్రాలు, నిఘా కెమెరాలు, విమానాల రాకపోకలు, విమానాశ్రయ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అనధికారికంగా బయటకు వెల్లడించకూడదని స్పష్టం చేశారు.
సర్క్యులర్‌లోని ఆర్టికల్ 2 ప్రకారం ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కువైట్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. విమానాశ్రయ కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలు, కీలక సమాచారాన్ని అనధికారికంగా బయటకు వెళ్లకుండా నిరోధించడం, భద్రతా వ్యవస్థలను పరిరక్షించడం లక్ష్యంగా ఈ ఆంక్షలు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో యు.ఎస్. పోలో అసోసియేషన్ కొత్త స్టోర్ ప్రారంభం..
- 30 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవం..!
- యూఏఈలో గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌లకు కొత్త పరీక్షలు..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- నకిలీ ప్రకటనల పై హెచ్చరించిన ఒమన్ పోలీసులు..!!
- కువైట్ విమానాశ్రయంలో కొత్త ఆంక్షలు..!!
- రెస్టారెంట్లు, హోటళ్లకు BD3,000 వరకు జరిమానా ప్రతిపాదన..!!
- వారంలోనే QR572 మిలియన్లు దాటిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- జోర్డాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026..







