నకిలీ ప్రకటనల పై హెచ్చరించిన ఒమన్ పోలీసులు..!!
- November 06, 2026
మస్కట్: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటన పూర్తిగా నకిలీదని ఒమన్ రాయల్ పోలీస్ (ROP) స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సందేశాల ద్వారా ప్రజలను మోసం చేసి ఆన్‌లైన్ ఆర్థిక నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
గుర్తుతెలియని లింకులు, అనధికారిక వెబ్‌సైట్లను క్లిక్ చేయవద్దని ప్రజలకు సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు రాయల్ ఒమన్ పోలీస్ అధికారిక సమాచార మార్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని కోరింది.
అనుమానాస్పద సందేశాలు లేదా లింకులు ఎదురైతే వాటిని నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో యు.ఎస్. పోలో అసోసియేషన్ కొత్త స్టోర్ ప్రారంభం..
- 30 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవం..!
- యూఏఈలో గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌లకు కొత్త పరీక్షలు..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- నకిలీ ప్రకటనల పై హెచ్చరించిన ఒమన్ పోలీసులు..!!
- కువైట్ విమానాశ్రయంలో కొత్త ఆంక్షలు..!!
- రెస్టారెంట్లు, హోటళ్లకు BD3,000 వరకు జరిమానా ప్రతిపాదన..!!
- వారంలోనే QR572 మిలియన్లు దాటిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- జోర్డాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026..







