హైదరాబాద్‌లో యు.ఎస్. పోలో అసోసియేషన్ కొత్త స్టోర్ ప్రారంభం..
- November 06, 2026
హైదరాబాద్: ప్రముఖ క్యాజువల్ వేర్ బ్రాండ్ యు.ఎస్. పోలో అసోసియేషన్ (U.S. Polo Assn.) దక్షిణ భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో సరికొత్త ఐడెంటిటీ స్టోర్‌ను ప్రారంభించింది. నవంబర్ 5, 2026న జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు అఖిల్ అక్కినేని ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమారు 2,105 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ద్వారా బ్రాండ్ తన ఆధునిక రిటైల్ డిజైన్‌ను, మెరుగైన షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు పరిచయం చేస్తోంది. ఈ స్టోర్‌లో పురుషుల దుస్తులు, పాదరక్షలు, పిల్లల దుస్తులకు సంబంధించిన విభిన్న ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 2026 ఆటం–వింటర్ కలెక్షన్లో భాగంగా పోలో, వర్సిటీ, ఇండిగో, కార్డురాయ్, డెనిమ్, షర్ట్స్ వంటి ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రీడా స్ఫూర్తితో కూడిన సంప్రదాయ శైలిని ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా మేళవించి ఈ కలెక్షన్‌ను రూపొందించారు.
ప్రత్యేక ఆకర్షణగా షర్ట్ బార్..వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభవం
ఈ కొత్త స్టోర్‌లో ప్రత్యేక ఆకర్షణగా షర్ట్ బార్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. దక్షిణ భారతదేశంలో షర్ట్‌లకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల షర్ట్‌లను ఒకే ప్రత్యేక విభాగంలో అందుబాటులో ఉంచారు.వినియోగదారులు తమ అభిరుచులు, సందర్భాలకు అనుగుణంగా షర్ట్‌లను ఎంపిక చేసుకునేలా ఈ విభాగాన్ని తీర్చిదిద్దారు.ఈ సందర్భంగా యు.ఎస్. పోలో అసోసియేషన్ ఇండియా సీఈఓ అమితాబ్ సూరి మాట్లాడుతూ.. హైదరాబాద్ తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని, హిమాయత్‌నగర్‌లో కొత్త ఐడెంటిటీ స్టోర్ ప్రారంభించడం నగరంలో బ్రాండ్ విస్తరణలో మరో ముఖ్యమైన ముందడుగు అని తెలిపారు. స్టోర్ ప్రారంభానికి లభించిన స్పందన సంతోషాన్నిచ్చిందని, వినియోగదారులకు మరింత మెరుగైన రిటైల్ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.భారతదేశంలో తమ రిటైల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంటూ, ఆధునిక ఫ్యాషన్ అభిరుచులకు అనుగుణంగా కొత్త కలెక్షన్లను పరిచయం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో షాపింగ్ ప్రియులకు ఈ కొత్త స్టోర్ మరో ఫ్యాషన్ డెస్టినేషన్‌గా నిలవనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో యు.ఎస్. పోలో అసోసియేషన్ కొత్త స్టోర్ ప్రారంభం..
- 30 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవం..!
- యూఏఈలో గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌లకు కొత్త పరీక్షలు..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- నకిలీ ప్రకటనల పై హెచ్చరించిన ఒమన్ పోలీసులు..!!
- కువైట్ విమానాశ్రయంలో కొత్త ఆంక్షలు..!!
- రెస్టారెంట్లు, హోటళ్లకు BD3,000 వరకు జరిమానా ప్రతిపాదన..!!
- వారంలోనే QR572 మిలియన్లు దాటిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- జోర్డాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026..







