గ్లోబల్ టెక్ హబ్‌గా దోహా.. రెండోసారి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026..!!
- November 06, 2026
దోహా: అంతర్జాతీయ సాంకేతిక రంగంలో కీలక కేంద్రంగా ఎదిగేందుకు ఖతార్ తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC26) రెండో ఎడిషన్ వచ్చే వారం దోహాలో జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ సంస్థల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం, కొత్త పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖతార్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MCIT) ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఖతార్ డిజిటల్ అజెండా 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
2025లో కీలక ఒప్పందం
ఖతార్‌ను అంతర్జాతీయ డిజిటల్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలకు 2025 మార్చిలో కీలక ముందడుగు పడింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ను దోహాలో నిర్వహించేందుకు MCIT, గ్లోబల్ మొబైల్ ఆపరేటర్స్ సంఘం GSMAతో ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం అనంతరం 2025 నవంబర్‌లో తొలిసారిగా MWC దోహా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వక్తలు, అంతర్జాతీయ, స్థానిక టెక్నాలజీ సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విధానాలపై జరిగే చర్చలను వేగంగా మారుతున్న టెక్నాలజీ అభివృద్ధితో అనుసంధానించి, వాటిని ఆచరణలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అంతర్జాతీయ సంస్థలకు పెట్టుబడుల వేదిక
MWC దోహా కేవలం సాంకేతిక సదస్సుకే పరిమితం కాకుండా, స్థానిక మార్కెట్‌ను బలోపేతం చేసే బహుముఖ వేదికగా పనిచేస్తోందని MCIT వివరించింది. ప్రపంచ టెక్నాలజీ సంస్థలు, విధాన రూపకర్తలను ఒకచోట చేర్చి భవిష్యత్తు డిజిటల్ విధానాల రూపకల్పనకు ఇది సహకరిస్తోంది. అలాగే ఖతార్‌కు చెందిన కంపెనీలు, స్థానిక ప్రతిభావంతులు, నిపుణులను అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానిస్తోంది. తద్వారా స్థానిక వ్యాపారాలకు కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడుల అవకాశాలు లభించనున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ సదస్సు ద్వారా ప్రపంచ సాంకేతిక విధానాల రూపకల్పనలో ఖతార్ పాత్రను పెంచడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి, దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
- తెలంగాణ పోలీసుల ఆరోగ్యానికి ‘ఫిట్‌కాప్’.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక చర్యలు
- 5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!
- 2030 నాటికి జీసీసీ రైల్వే నెట్వర్క్.. బహ్రెయిన్ సమీక్ష..!!
- ఒమన్‌లో భారీగా సిగరెట్లు, నమిలే పొగాకు పట్టివేత..!!
- గ్లోబల్ టెక్ హబ్‌గా దోహా.. రెండోసారి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026..!!
- యూఏఈ పిల్లల్లో తగ్గుతున్న చేతిరాత నైపుణ్యం..!!
- 122 సాంకేతిక రంగాలకు సౌదీ నాణ్యత పరీక్షల విస్తరణ..!!
- ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధి పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్







