ఒమన్‌లో భారీగా సిగరెట్లు, నమిలే పొగాకు పట్టివేత..!!

- November 06, 2026 , by Maagulf
ఒమన్‌లో భారీగా సిగరెట్లు, నమిలే పొగాకు పట్టివేత..!!

మస్కట్: ఒమన్‌లో అక్రమంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల తరలింపునకు ప్రయత్నించిన ఆసియా దేశానికి చెందిన ఓ ప్రవాసిని భద్రతా పోలీసులు అరెస్ట్ చేశారు.

అల్ దాహిరా గవర్నరేట్‌లోని పెట్రోలియం రాయితీ ప్రాంతంలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్‌స్టాలేషన్స్ సెక్యూరిటీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడి వద్ద భారీ మొత్తంలో సిగరెట్లు, నమిలే పొగాకు ఉత్పత్తులు గుర్తించారు.

వీటిని అక్రమంగా తరలించి విక్రయించే ఉద్దేశంతో తన వద్ద ఉంచుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com