6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం

- November 06, 2026 , by Maagulf
6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం

జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న 6వ హజ్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ 2027లో పాల్గొనేందుకు భారత ప్రతినిధి బృందం జెడ్డాకు చేరుకుంది. హజ్ 2027కు సంబంధించి సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకాలు చేయడంతో పాటు, యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

జెడ్డా విమానాశ్రయంలో భారత ప్రతినిధి బృందానికి భారత కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా భారత్, సౌదీ అరేబియా అధికారుల మధ్య కీలక సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. రాబోయే హజ్ యాత్రకు సంబంధించి ఇరు దేశాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.

ముఖ్యంగా 2027 హజ్ యాత్రకు అవసరమైన ఏర్పాట్లను సమీక్షించడం, భారతీయ హజ్ యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఎలాంటి ఇబ్బందులు లేని యాత్రను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

ఈ పర్యటనలో సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకాలు చేయడం కీలక ఘట్టంగా నిలవనుంది. హజ్ 2027కు సంబంధించి ఇరు దేశాల మధ్య ఏర్పాట్లు, సహకారానికి ఈ ఒప్పందం మార్గదర్శకంగా ఉండనుంది.

భారతీయ హజ్ యాత్రికులకు మెరుగైన సేవలు అందించేందుకు సౌదీ అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్న భారత ప్రభుత్వ నిబద్ధతను ఈ పర్యటన మరోసారి చాటిచెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com