దీపావళి క్రాకర్స్ షాపులకు GHMC కొత్త రూల్స్..
- November 07, 2026
హైదరాబాద్: హైదరాబాద్ లో దీపావళి పండుగ వేళ బాణసంచా విక్రయాలు జరిపే వ్యాపారులకు గ్రేటర్ హైదరాబాద్ మ్యానిసిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక టపాసుల దుకాణాల లైసెన్స్ ఫీజును 10 శాతం పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
తాజా పెంపుతో రిటైల్ వ్యాపారులకు లైసెన్స్ ఫీజు రూ.13,310గా ఉండగా, హోల్‌సేల్ వ్యాపారులకు ఈ రుసుము రూ.79,860గా ఖరారు చేశారు. ఈ వ్యాపారం నిర్వహించాలనుకునే నిర్వాహకులు ముందుగా జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మీ-సేవ కేంద్రాల ద్వారా తప్పనిసరిగా ‘TIN’ (Taxpayer Identification Number) పొందాల్సి ఉంటుంది. అనుమతి లేని ప్రాంతాల్లో లేదా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
GHMC: భద్రతా ప్రమాదాలు మరియు తనిఖీలు
ప్రతి టపాసుల దుకాణంలోనూ అగ్నిప్రమాదాలను నివారించేందుకు తగినన్ని అగ్నిమాపక పరికరాలు (Fire Extinguishers) అందుబాటులో ఉంచడం తప్పనిసరి. దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు జరిగినా, వాటికి పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులు పెంపు..!!
- దీపావళి క్రాకర్స్ షాపులకు GHMC కొత్త రూల్స్..
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్
- భారతీయుడికి వైద్య అత్యవసర పరిస్థితి.. హెలికాప్టర్లో తరలించిన ఒమన్ వైమానిక దళం
- ఢిల్లీలో వాయు కాలుష్యం.. అమల్లోకి మూడో దశ ఆంక్షలు
- పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫిబ్రవరి 16 నుంచే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- దుబాయ్‌లో నవంబర్ 16 నుంచి వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2026.. 90కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు







