కువైట్‌లో ‘లులూ వాలీ దీపావళి 2026’ వేడుకలు..!!

- November 09, 2026 , by Maagulf
కువైట్‌లో ‘లులూ వాలీ దీపావళి 2026’ వేడుకలు..!!

కువైట్: దీపావళి పండుగను పురస్కరించుకుని కువైట్‌లోని అన్ని లులూ హైపర్ మార్కెట్ బ్రాంచ్‌లలో ‘లులూ వాలీ దీపావళి 2026’ వేడుకలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రత్యేక పండుగ ఆఫర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అల్ రాయ్‌లోని లులూ హైపర్ మార్కెట్ అవుట్‌లెట్‌లో వేడుకల ప్రారంభోత్సవం నిర్వహించారు. 

వేడుకల్లో భాగంగా నిర్వహించిన రంగోలి పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు పాల్గొని సంప్రదాయ రంగోలి డిజైన్లతో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీల్లో మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. దీపావళి సందర్భంగా కువైట్‌లోని అన్ని లులూ హైపర్ మార్కెట్ బ్రాంచ్‌లను ప్రత్యేకంగా అలంకరించారు. సంప్రదాయ దీపాలు, రంగురంగుల అలంకరణలు, ప్రత్యేక సెల్ఫీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. వినియోగదారులు పండుగ జ్ఞాపకాలను ఫొటోల రూపంలో భద్రపరుచుకునేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.

అలాగే దీపావళి షాపింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చారు. నమ్కీన్, సంప్రదాయ స్వీట్లు, భారతీయ వస్త్రాలు, మట్టి దీపాలు, అలంకరణ లైట్లు, గృహాలంకరణ వస్తువులపై ప్రత్యేక ప్రమోషన్లు ప్రకటించారు. ప్రతి బ్రాంచ్‌లో ప్రత్యేక స్వీట్ కౌంటర్లను ఏర్పాటు చేసి వివిధ రకాల సంప్రదాయ భారతీయ మిఠాయిలను అందిస్తున్నారు. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవిస్తూ సమాజంలోని ప్రజలను ఒకచోట చేర్చడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని లులూ హైపర్ మార్కెట్ ప్రతినిధులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com