ఖతార్‌లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!

- November 09, 2026 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!

దోహా: ఖతార్‌లోకి ప్రవేశించేందుకు, దేశం నుంచి బయటకు వెళ్లేందుకు మరో రెండు కొత్త ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి నిర్ణయం జారీ చేశారు. ఉమ్ అల్ హౌల్ పోర్టు, దుఖాన్ ఎయిర్ బేస్ విమానాశ్రయాలకు ఈ జాబితాలో చోటు కల్పించారు.  

కాగా, సముద్ర మార్గంలో ప్రవేశించే, బయటకు వెళ్లే అధికారిక పాయింట్ల జాబితాలో ఉమ్ అల్ హౌల్ పోర్టును చేర్చారు. అలాగే విమాన మార్గంలో రాకపోకలు సాగించే అధికారిక పాయింట్ల జాబితాలో దుఖాన్ ఎయిర్ బేస్ విమానాశ్రయాన్ని చేర్చారు.

అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారిక గెజిట్‌లో ఈ నిర్ణయం ప్రచురితమైన మరుసటి రోజు నుంచి అమల్లోకి వస్తుంది. నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలకు అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com