కువైట్‌లో 13 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- November 09, 2026
ఫర్వానియా: కువైట్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న 13 మంది ఆసియా దేశస్థులను భద్రతా అధికారులు అరెస్టు చేశారు. ఫర్వానియా ప్రాంతంలో లాటరీ విధానాన్ని ఉపయోగించి గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌ను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అధికారులు గుర్తించి ఈ చర్యలు చేపట్టారు.
కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్రమ కార్యకలాపాలు, సమాజానికి హానికరమైన చర్యలను అరికట్టేందుకు చేపట్టిన తనిఖీల్లో ఈ నెట్‌వర్క్ గుట్టురట్టయింది.
విచారణలో భాగంగా ఓ వాణిజ్య సముదాయంలోని రెండు కిరాణా దుకాణాలను గ్యాంబ్లింగ్ నిర్వహించేందుకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాడుల్లో గ్యాంబ్లింగ్ కి ఉపయోగించిన పరికరాలు, పలు పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచి విక్రయించేందుకు సిద్ధం చేసిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్లో ఘనంగా ప్రారంభమైన MWC26 దోహా..!!
- అరబ్ దేశాల ఐక్యత మరింత బలోపేతం కావాలి: హమద్
- కువైట్‌లో 13 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- యూఏఈ పాఠశాలల్లో కఠినమైన సైబర్ భద్రతా నిబంధనలు..!!
- దీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. మూడు ఘటనల్లో 18 మంది సజీవదహనం!
- వాహనదారులకు తెలంగాణ RTA గుడ్ న్యూస్
- టపాసులతో 48 మందికి కంటికి గాయాలు!
- ఖతార్లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!
- అల్ దఖిలియాలో OMR103 మిలియన్లతో రోడ్ల ప్రాజెక్టులు..!!
- ఒమన్ సముద్రంలో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!







