అరబ్ దేశాల ఐక్యత మరింత బలోపేతం కావాలి: హమద్
- November 09, 2026
మనామా: ప్రాంతీయంగా నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అరబ్ దేశాల మధ్య ఐక్యత, గల్ఫ్ దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా పిలుపునిచ్చారు. ప్రాంతీయ భద్రత, సుస్థిరతను కాపాడేందుకు అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ మేరకు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో రాజు హమద్ సమావేశమయ్యారు.
ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అరబ్ దేశాలతో పాటు విస్తృత ప్రాంతంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు చేపడుతున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధత, దేశాల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని రాజు పేర్కొన్నారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
అరబ్ దేశాల ఐక్యతే బలం
ప్రస్తుత కీలక పరిస్థితుల్లో అరబ్ దేశాల ఐక్యత, సంఘీభావం వాటికి ప్రధాన బలమని రాజు హమద్ పేర్కొన్నారు. ఈ ఐక్యత ఉమ్మడి నిర్ణయాలు, సమన్వయ చర్యల రూపంలో ప్రతిబింబించాలని అన్నారు. తద్వారా అరబ్ దేశాల ప్రయోజనాలు, సాధించిన విజయాలను కాపాడటంతో పాటు అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని అడ్డుకోవచ్చని తెలిపారు.
అరబ్ దేశాలు సమష్టిగా వ్యవహరిస్తే ప్రాంతీయ పరిణామాలపై తమ ప్రభావాన్ని పెంచుకోవచ్చని, ప్రస్తుత సవాళ్లకు పరిష్కారాలు కనుగొనే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రాంతీయ భద్రత, సుస్థిరత పునరుద్ధరణకు న్యాయమైన, సమగ్ర శాంతి సాధన అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
గల్ఫ్ దేశాల సహకార మండలి (GCC) పాత్రను కూడా రాజు ప్రశంసించారు. సభ్య దేశాల భద్రత, సుస్థిరతకు ముప్పుగా పరిణమించే సవాళ్లను ఎదుర్కోవడంలో జీసీసీ కీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఘనంగా ప్రారంభమైన MWC26 దోహా..!!
- అరబ్ దేశాల ఐక్యత మరింత బలోపేతం కావాలి: హమద్
- కువైట్లో 13 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- యూఏఈ పాఠశాలల్లో కఠినమైన సైబర్ భద్రతా నిబంధనలు..!!
- దీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. మూడు ఘటనల్లో 18 మంది సజీవదహనం!
- వాహనదారులకు తెలంగాణ RTA గుడ్ న్యూస్
- టపాసులతో 48 మందికి కంటికి గాయాలు!
- ఖతార్లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!
- అల్ దఖిలియాలో OMR103 మిలియన్లతో రోడ్ల ప్రాజెక్టులు..!!
- ఒమన్ సముద్రంలో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!







