ఖతార్‌లో ఘనంగా ప్రారంభమైన MWC26 దోహా..!!
- November 09, 2026
దోహా: ప్రపంచ టెలికమ్యూనికేషన్ల రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఖతార్ రాజధాని దోహాలో రెండో విడత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC26) ఘనంగా ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), తదుపరి తరం 6G నెట్‌వర్క్‌లు, అంతరాయం లేని ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి అంశాలు ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి.
‘ది IQ ఎరా’ (The IQ Era) థీమ్‌తో మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. GSMA సంస్థ, ఖతార్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MCIT) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ప్రారంభ కార్యక్రమానికి ఖతార్ ఉప ప్రధాని, రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్ థానీ, ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారీ, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మొహమ్మద్ బిన్ అలీ అల్ మన్నాయ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులు, సాంకేతిక రంగ నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి అల్ మన్నాయ్ మాట్లాడుతూ.. టెలికమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాల అవసరాలు ప్రస్తుతం గణనీయంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏజెంట్లు స్వయంగా వివిధ పనులను నిర్వహించే స్థాయికి సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరింత శక్తివంతమైన కంప్యూటింగ్ సామర్థ్యాలు, పటిష్టమైన నెట్‌వర్క్‌లు అవసరమవుతున్నాయని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, సవాళ్ల నేపథ్యంలో నిరంతర కనెక్టివిటీని కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ నెట్వర్క్ మార్గాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీలు, పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని పెంచేందుకు MWC దోహా వేదికగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఘనంగా ప్రారంభమైన MWC26 దోహా..!!
- అరబ్ దేశాల ఐక్యత మరింత బలోపేతం కావాలి: హమద్
- కువైట్‌లో 13 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- యూఏఈ పాఠశాలల్లో కఠినమైన సైబర్ భద్రతా నిబంధనలు..!!
- దీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. మూడు ఘటనల్లో 18 మంది సజీవదహనం!
- వాహనదారులకు తెలంగాణ RTA గుడ్ న్యూస్
- టపాసులతో 48 మందికి కంటికి గాయాలు!
- ఖతార్‌లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!
- అల్ దఖిలియాలో OMR103 మిలియన్లతో రోడ్ల ప్రాజెక్టులు..!!
- ఒమన్ సముద్రంలో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!







