మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక విభాగం.. గచ్చిబౌలిలో నూతన భవనం ప్రారంభం

- November 10, 2026 , by Maagulf
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక విభాగం.. గచ్చిబౌలిలో నూతన భవనం ప్రారంభం

హైదరాబాద్: మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక అడుగు వేసింది. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం (Women & Children Safety Wing) భవనాన్ని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, బాధితులకు మెరుగైన సేవలు అందించడం, భద్రతకు సంబంధించిన ఫిర్యాదులపై వేగంగా స్పందించడం వంటి లక్ష్యాలతో ఈ ప్రత్యేక విభాగం పనిచేయనుంది.

మహిళలు, చిన్నారులకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల్లో ఈ నూతన భవనం కీలకంగా నిలవనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com