సౌదీ అరామ్‌కో భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎమిర్..!!

- November 10, 2026 , by Maagulf
సౌదీ అరామ్‌కో భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎమిర్..!!

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో హౌతీ దాడికి గురైన సౌదీ అరామ్‌కో (Saudi Aramco) పరిపాలనా భవనాన్ని రియాద్ ప్రాంత డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ సందర్శించి పరిశీలించారు. దాడి కారణంగా భవనానికి జరిగిన స్వల్ప నష్టాన్ని ఆయన సమీక్షించారు.

ఆదివారం ఉదయం భవనాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడికి ప్రయత్నం జరిగింది. ఈ ఘటనలో డ్రోన్ శకలాలు భవన ప్రాంగణంలో పడటంతో కొంతమేర నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సౌదీ ఇంధన మంత్రిత్వశాఖ వెల్లడించింది. సంఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.

 ప్రిన్స్ మహమ్మద్ మాట్లాడుతూ.. పౌర సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీల దాడులు ఆ సంస్థ పట్ల సౌదీ అరేబియా గతంలో వ్యక్తం చేసిన వైఖరిని మరింత బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. దాడి అనంతరం పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో పౌర, సైనిక, భద్రతా విభాగాల సిబ్బంది చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. జాతీయ ఐక్యతతో పాటు దేశ భద్రతకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సౌదీ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com