హైదరాబాద్ విమానాశ్రయంలో క్యాట్-III రన్‌వే సామర్థ్యం మెరుగుదల

- November 11, 2026 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయంలో క్యాట్-III రన్‌వే సామర్థ్యం మెరుగుదల

హైదరాబాద్: జీఎంఆర్ ఏరో ఆధ్వర్యంలోని కన్సార్టియంలో భాగమైన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వే 09ఆర్‌కు క్యాట్-III ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ (AGL) సామర్థ్యాన్ని విజయవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అభివృద్ధి విమానాశ్రయ విమానాశ్రయ ప్రాంగణ మౌలిక సదుపాయాలు, కార్యకలాపాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక ముందడుగుగా నిలిచింది. ఈ ఆధునిక సదుపాయం ద్వారా అత్యంత తక్కువ దృశ్యమానత ఉన్న పరిస్థితుల్లోనూ విమానాల రాకపోకలను నిర్వహించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు కారణంగా విమానాల దారి మళ్లింపులు, ఆలస్యాలను తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మరింత విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఇది దోహదపడుతుంది.

క్యాట్-II నుంచి క్యాట్-III సామర్థ్యానికి అప్‌గ్రేడ్ కావడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విమాన కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించే హైదరాబాద్ విమానాశ్రయ సామర్థ్యం మరింత పెరిగింది. తక్కువ దృశ్యమానత కారణంగా ఏర్పడే అంతరాయాలను తగ్గిస్తూ, విమానాల షెడ్యూల్‌ సమయపాలనను మెరుగుపరచడానికి ఈ సదుపాయం తోడ్పడుతుంది. దీని ద్వారా ప్రయాణికులకు మరింత ముందుగా అంచనా వేయగలిగే ప్రయాణ అనుభవం, మెరుగైన విమాన కనెక్టివిటీ లభించనుండగా, విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించడంతో పాటు సమయపాలనను మరింత మెరుగుపరచుకోగలుగుతాయి.

ఈ అవగాహన ఒప్పందంపై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ సీఈఓ కధీర్ కధీరవన్ మాట్లాడుతూ, “క్యాట్-III సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా హైదరాబాద్ విమానాశ్రయం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కార్యకలాపాలు నిర్వహించగల భవిష్యత్‌ అవసరాలకు సిద్ధమైన విమానయాన కేంద్రంగా ఎదిగే ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్న విమానాశ్రయ దార్శనికతకు అనుగుణంగా ఈ అభివృద్ధి జరిగింది. అత్యంత తక్కువ దృశ్యమానత ఉన్న పరిస్థితుల్లోనూ విమాన కార్యకలాపాలను సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడే అంతరాయాలు తగ్గడంతో పాటు విమానాల షెడ్యూల్‌ సమయపాలన మెరుగుపడుతుంది. ప్రయాణికుల విషయానికి వస్తే, దీనివల్ల విమానాల ఆలస్యాలు తగ్గి, ప్రయాణాలు మరింత సజావుగా సాగడంతో పాటు ప్రయాణ ప్రణాళికలపై మరింత విశ్వాసం ఏర్పడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రత, కార్యకలాపాల అత్యుత్తమ నిర్వహణ, సేవల నాణ్యతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విమానాశ్రయంగా హైదరాబాద్ విమానాశ్రయ స్థానాన్ని ఈ సామర్థ్యం మరింత బలోపేతం చేస్తుంది” అని తెలిపారు.

తక్కువ దృశ్యమానత ఉన్న పరిస్థితుల్లో విమాన కార్యకలాపాలను మరింత పటిష్ఠంగా నిర్వహించేందుకు హైదరాబాద్ విమానాశ్రయం కీలకమైన విమానాశ్రయ ప్రాంగణ వ్యవస్థలను ఆధునికీకరించింది. ఇందులో క్యాట్-III ప్రమాణాలకు అనుగుణమైన రన్‌వే లైటింగ్ వ్యవస్థ, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు, స్టాండ్ మానూవరింగ్ గైడెన్స్ లైట్స్ (ఎస్ఎంజీఎల్) ఉన్నాయి. ఈ లైట్లు పైలట్లకు విమానాల కదలికల సమయంలో మెరుగైన మార్గదర్శకత్వాన్ని అందించడంతో పాటు విమానాశ్రయ ప్రాంగణ భద్రతను పెంపొందిస్తాయి. అంతేకాకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పీఎల్‌సీ (ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్)-ఎస్‌సీఏడీఏ (సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) ఆధారిత పరిష్కారాన్ని కూడా అమలు చేశారు. దీని ద్వారా ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ (ఏపీఓసీ) నుంచి లైటింగ్ వ్యవస్థలను ఒకే కేంద్రం ద్వారా పర్యవేక్షించడం, నియంత్రించడం సాధ్యమవుతుంది. ఇది విమానాశ్రయ ప్రాంగణ కార్యకలాపాల సామర్థ్యాన్ని, నిర్వహణ సమర్థతను మరింత పెంచుతుంది.

క్యాట్-III సామర్థ్యాన్ని విజయవంతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా హైదరాబాద్ విమానాశ్రయం కార్యకలాపాల అత్యుత్తమ నిర్వహణ, సాంకేతిక ఆధారిత ఆవిష్కరణల పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఈ ఆధునిక సదుపాయం తక్కువ దృశ్యమానత ఉన్న పరిస్థితుల్లో విమాన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించే విమానాశ్రయ సన్నద్ధతను మరింత పెంచడంతో పాటు, నిరంతరాయ విమాన కనెక్టివిటీకి, ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి తోడ్పడుతుంది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com