యూఏఈ ప్రాదేశిక జలాల్లో నౌకపై దాడి.. దెబ్బతిన్న ADNOC నౌక
- November 10, 2026
అబుదాబి: యూఏఈ ప్రాదేశిక జలాల్లోని అరేబియన్ గల్ఫ్‌లో ADNOC లాజిస్టిక్స్ అండ్ సర్వీసెస్‌కు చెందిన ఓ నౌక పై దాడి జరిగింది. ఈ ఘటనలో నౌక దెబ్బతిన్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.
నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఈ దాడి జరిగినట్లు ADNOC లాజిస్టిక్స్ అండ్ సర్వీసెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటన అనంతరం సంబంధిత బృందాలు సహాయక, స్పందన చర్యలు చేపట్టాయని పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని సంస్థ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రజలు సమాచారం కోసం అధికారిక వనరులపైనే ఆధారపడాలని, ధృవీకరించని వార్తలు, పుకార్లను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ ప్రాదేశిక జలాల్లో నౌకపై దాడి.. దెబ్బతిన్న ADNOC నౌక
- 2027 నుంచి సౌదీ అరేబియాలో అల్ట్రా లగ్జరీ ఎడారి రైలు..బుకింగ్స్ ప్రారంభం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- అన్నవరం గిరి ప్రదక్షిణ గీతం ఆవిష్కరణ-డా.గజల్ శ్రీనివాస్
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా డీఎస్పీలు విధులు నిర్వహించాలి: సీఎం రేవంత్
- 14, 15 తేదీల్లో ఈదురుగాలులు.. జాగ్రత్త
- తెలంగాణ గవర్నర్‌తో కర్ణాటక గవర్నర్ మర్యాదపూర్వక భేటీ
- మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక విభాగం.. గచ్చిబౌలిలో నూతన భవనం ప్రారంభం
- జెడ్డాలో తెలంగాణ సాంస్కృతిక ఉత్సవం..సంప్రదాయాలు, కళా వైభవాన్ని చాటిన వేడుకలు
- పిల్లలు, తల్లిదండ్రుల కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ డెమో సెషన్







