‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రకటించిన విజయసాయిరెడ్డి
- November 11, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP)ని ప్రకటించారు. నవంబర్ 11న విజయవాడ వేదికగా ఉదయం 11:31 గంటలకు పార్టీని ప్రకటించిన ఆయన.. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదికగా ఎదగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
యువతకు 66 శాతం అవకాశాలు
పార్టీ ఎజెండాలో యువతకు పెద్దపీట వేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజకీయాల్లో యువతకు 66 శాతం అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. అభివృద్ధి, ఉపాధి కల్పన, విద్య, వ్యవసాయం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. గతంలో ప్రకటించిన ప్రణాళికల్లో రైతులకు ఉచిత విద్యుత్, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రజల ఆదాయాలను పెంచడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.
తెలుపు, కాషాయ రంగులతో పార్టీ జెండా
‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయసాయిరెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుపు, కాషాయ రంగులతో రూపొందించిన జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తును ఏర్పాటు చేశారు. కొత్త పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
రెండు కుటుంబాల ఆధిపత్యానికి స్వస్తి పలకాలి: విజయసాయిరెడ్డి
ఏపీలో రాజకీయ వారసత్వానికి స్వస్తి పలకాలని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని, ఈ ఆధిపత్యానికి ముగింపు పలకాలని వ్యాఖ్యానించారు. సీఎం కొడుకే సీఎం కావాలా? ప్రతిపక్ష నేత కొడుకే సీఎం కావాలా? అని ప్రశ్నించారు. జగన్, చంద్రబాబు తప్పు చేస్తే ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తాను నాయకుడిగా ఎదగడానికి పార్టీ పెట్టలేదని, ఏపీలో మరో నాయకుడిని తయారు చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాల నుంచి యువ నాయకులను ప్రోత్సహిస్తానన్నారు. తమ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల ముందు తమ పార్టీ సత్తా చూపిస్తామని, ఏపీలో దుష్టపాలనకు చరమగీతం పాడతామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, నాయకత్వ బాధ్యతలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ కొత్త పార్టీ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్లు, క్షిపణుల దాడి యత్నం.. ధ్వంసం చేసిన సంకీర్ణ దళాలు
- అమెజాన్ పే ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’
- ‘దుబాయ్-ఇట్ అవార్డులు’ విజేతలకు షేక్ హమ్దాన్ సత్కారం..13 మందికి పురస్కారాలు
- యుద్ధ సమయాల్లో ఆసుపత్రులపై సైబర్ దాడుల ముప్పు.. బుర్జీల్ హోల్డింగ్స్ ఛైర్మన్ హెచ్చరిక
- ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రకటించిన విజయసాయిరెడ్డి
- బాండ్బజార్ నూతన సీఈఓగా ఎస్.శంభత్ కుమార్ నియామకం!
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
- ఖతార్లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!







