కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- November 11, 2026
కువైట్: పౌరులు, ప్రవాసులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత సిద్ధమైన సివిల్ ఐడీ (Civil ID) కార్డులను ఇంటి వద్దకే అందించే హోం డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) సన్నాహాలు చేస్తోంది.
సివిల్ ఐడీ కార్డుల డెలివరీ సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, PACI బోర్డు ఛైర్మన్ షేక్ ఫహద్ అల్ యూసుఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో పౌరులు, ప్రవాసులు తమ ఐడీ కార్డులను పొందేందుకు PACI ప్రధాన కార్యాలయానికి స్వయంగా వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
గతంలో కార్డుల డెలివరీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రత్యేక సంస్థతో ఒప్పందాన్ని పునరుద్ధరించకపోవడంతో సుమారు నాలుగేళ్ల క్రితం ఈ సేవలను నిలిపివేశారు. తాజాగా ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడం, డిజిటల్ విధానాలను విస్తరించడం, ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించడంలో భాగంగా వీటిని పునఃప్రారంభించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా సివిల్ ఐడీ కార్డుల డెలివరీ సేవలను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న ప్రత్యేక సంస్థల నుంచి PACI ప్రీ-క్వాలిఫికేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సేవలు తిరిగి ప్రారంభమైతే సిద్ధమైన సివిల్ ఐడీ కార్డులను ఇంటి వద్దే పొందే మరో సౌకర్యం పౌరులు, ప్రవాసులకు అందుబాటులోకి రానుంది. అయితే సేవలు ప్రారంభమయ్యే ఖచ్చితమైన తేదీని PACI ఇంకా ప్రకటించలేదు.
తాజా వార్తలు
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
- ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!
- పిల్లల సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత నిబంధనలు..!!
- ఒమన్‌లో స్టార్‌లింక్ పరికరాల అక్రమ రవాణా యత్నం భగ్నం..!!
- ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక జారీ
- రేపటి నుంచి హైదరాబాద్ లో ‘భారత్ సమ్మిట్’
- వైజాగ్ వేదికగా అంతర్జాతీయ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా
- ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు తక్కువ వడ్డీ రుణాలు..!!







