ఖతార్‌ ప్రజలకు హోం శాఖ హెచ్చరిక..!!

- November 13, 2026 , by Maagulf
ఖతార్‌ ప్రజలకు హోం శాఖ హెచ్చరిక..!!

దోహా: ఖతార్‌లో ఎడారి ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు, క్యాంపింగ్‌కు వెళ్లేవారు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సూచించింది.

చమురు, సహజ వాయువు (ఆయిల్ అండ్ గ్యాస్) కేంద్రాలు, వాటి సరఫరా, పంపిణీ పైప్‌లైన్లకు నిర్ణీత భద్రతా దూరం పాటించాలని కోరింది. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్లు, వాటికి అనుబంధంగా ఉన్న స్టేషన్లకు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది.

మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఈ మేరకు అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ఈ సూచనలు జారీ చేసింది. ప్రజలు భద్రతా మార్గదర్శకాలను పాటించడంతో పాటు, అక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను గమనించాలని కోరింది. వ్యక్తుల ప్రాణాలను, దేశంలోని కీలక చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఈ జాగ్రత్తలు అవసరమని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com