ఆరు వారాలుగా వెంటిలేటర్ పై భారతీయ టాక్సీ డ్రైవర్
- August 29, 2016
గత నెల జులై 16 వ తేదీ నుంచి ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో భారతీయ వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ తో వెంటిలేటర్ పై చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. అతని కుటుంబం ఆ వ్యక్తిని తమ స్వంత ప్రాంతం కేరళ రాష్ట్రంకు తరలించడానికి సిద్ధమైనది కాని ఆస్పత్రి సూచన ప్రకారం ఆ వ్యక్తిని ఒక ఎయిర్ అంబులెన్స్ లో తీసుకువెళ్లడం మంచిదని సిఫార్సు చేసింది. అయితే ఆ కుటుంబం ఆర్ధికంగా స్థిరమైన పరిస్థితిలో లేదు. అబూ ధాబీలో టాక్సీ డ్రైవర్ గా పనిచేసే కోయిల్పారంబిల్ జార్జ్ (42 ) బనియన్ ప్రాంతంలో జూలై 15, శుక్రవారం తీవ్రమైన తలనొప్పితో బాధపడ్తూ, తన సోదరుడైన ఆస్టిన్ బ్రూస్ ని వెంటనే పిలిచాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారుపై అదుపు కోల్పోయాడు. అదేవిధంగా కళ్ళు మసకబారిపోయాయి. దీనితో కోయిల్పారంబిల్ జార్జ్ సోదరుడు అతన్ని ఒక ప్రైవేట్ క్లినిక్ అతన్ని తరలించారు మరియు అక్కడ నుండి ముస్సఫహ్ ఆహాలియా ఆస్పత్రికి. కేసు తీవ్రత కారణంగా, వారు మేము స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించామని సూచించారు.వెంటనే మేము క్లీవ్లాండ్ ఆస్పత్రి లో చేర్పించామని " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. అక్కడ చికిత్స అనంతరం మరింత వైద్య సంరక్షణ కోసం కేరళకు తిరిగి జార్జ్ ని తరలించవచ్చని ఆసుపత్రి వర్గాలు బ్రూస్ కి తెలిపారు .మేము అతనిని పంపించడానికి సిద్ధంగా ఉన్నామని అయితే జార్జ్ ని ఒక ఎయిర్ అంబులెన్స్ లో తరలించడం మంచిదని " ఒక డాక్టర్ చెప్పారు.జార్జ్ కు ఒక బీమా రక్షణ ఉంది. ఇది ఆ కుటుంబంకు ఎంతో పెద్ద ఉపశమనంగా మారింది . "అయితే, ఎయిర్ అంబులెన్స్ ఖర్చులు బీమా పరిధిలోనికి రావని బ్రూస్ తెలిపారు. మేము మా సోదరుడిని ఎలాగైనా కేరళకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాం ఆసుపత్రిలో కూడా మాకు సూచిస్తుంది. కేరళకు మేము చేరుకొంటే మాకు సహాయం చేసేందుకు అనేక మంది ఉన్నారని ఆయన తెలిపారు. జార్జ్ భార్య మేరీ అంజూ ఆమె అనారోగ్య భర్త కోసం శ్రద్ధ వహించడానికి ఒక సందర్శన వీసాతో ఇక్కడ ఉంది కానీ ఆమె గత వారం తిరిగి స్వదేశానికి చేరుకొంది.ఒక ఎయిర్ అంబులెన్స్ లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు 60,000 డాలర్ల నుంచి - 70,000 డాలర్ల (210,000 డి హెచ్ ) మధ్యలో ఖర్చు ఉంటుంది. వాణిజ్య సేవ ఒక ఎయిర్ అంబులెన్స్ సంస్థ 15 వేలు 20,000 వేల డాలర్ల (73,000 డి హెచ్ ), అధికారిక ఖర్చు ఉంటుందని అఆయన అన్నారు. అదే ఒక వ్యాపార విమానంలో చౌకగా తన సోదరుడిని తరలించవచ్చని కానీ ఈ ఎంపిక ఎంతో ప్రమాద కారకంగా పరిణమించవచ్చని బ్రూస్ అంటున్నారు. జార్జ్ తండ్రి ఫోర్ట్ కొచీ లో పనిచేస్తున్న కె. ఇ. ఫిలోదాస్ ఆగస్టు 2 వ తేదీన తన కుమారుని పరిస్థితిపై వివరంగా తెలియచేస్తూ , భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఒక లేఖ పంపించారు. దీనికి ప్రతిస్పందన కోసం వేచి ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







