కువైట్‌లో ఆహార తయారీ కేంద్రాలపై PAFN దాడులు..!!
- November 14, 2026
కువైట్: కువైట్‌లోని క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ప్రైవేట్ ఇళ్లలో అక్రమంగా నిర్వహిస్తున్న 7 ఆహార తయారీ కేంద్రాలను పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) అధికారులు గుర్తించారు. మొత్తం 5 ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో 33 ఉల్లంఘనలను నమోదు చేశారు.
PAFN క్యాపిటల్ గవర్నరేట్ తనిఖీ విభాగం, కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరోగ్య అనుమతులు లేకుండా ఆహార వ్యాపారాలు నిర్వహించడం, తినడానికి అనువుగాని ఆహార పదార్థాలను తయారు చేయడం, పరిశుభ్రత నిబంధనలు పాటించకపోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
అలాగే ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు లేని కార్మికులతో పనిచేయించడం, ఆహార తయారీ కేంద్రాల ప్రాంగణాలను నివాసాలుగా ఉపయోగించడం వంటి అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తనిఖీలు, ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగిస్తామని PAFN స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆంక్షలు లేకుండా మానవతా సాయం అందించాలని ఖతార్ పిలుపు..!!
- అబుదాబి హోటల్లో ఘర్షణ.. 8 మందికి 6 నెలల జైలు..!!
- కువైట్‌లో ఆహార తయారీ కేంద్రాలపై PAFN దాడులు..!!
- దుబాయ్‌లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల నిఘా..ఒక్క నెలలో 27,756 ఉల్లంఘనలు గుర్తింపు
- ఫుజైరా రోడ్డు ప్రమాద మృతులకు యూఏఈలో సామూహిక అంత్యక్రియలు..
- హైదరాబాద్ కొత్త సీపీగా మహేశ్ భగవత్ బాధ్యతల స్వీకరణ
- GMU మెడికల్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌కు 10 వేల మందికి పైగా విద్యార్థులు
- బిట్స్ పిలానీ దుబాయ్‌లో డే టైమ్ ఎంబీఏ తరగతులు ప్రారంభం
- ప్రధాని మోదీ చేతుల మీదుగా బెంగళూరు మెట్రో పింక్ లైన్ ప్రారంభం
- దుబాయ్‌లో నవంబర్ 21, 22 తేదీల్లో నగరవ్యాప్త ధ్యాన కార్యక్రమం







