ఖతార్‌లో పాస్‌పోర్టు, ఐడీ కార్డులు పోగొట్టుకున్నారా?

- November 15, 2026 , by Maagulf
ఖతార్‌లో పాస్‌పోర్టు, ఐడీ కార్డులు పోగొట్టుకున్నారా?

దోహా: ఖతార్‌లో పాస్‌పోర్టు లేదా జాతీయ గుర్తింపు కార్డు (Qatar ID) పోగొట్టుకున్న పౌరులు వెంటనే మెట్రాష్ (Metrash) యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) సూచించింది. ఈ మేరకు జాతీయత, ప్రయాణ పత్రాల విభాగం పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది. పాస్‌పోర్టు లేదా జాతీయ గుర్తింపు కార్డు పోగొట్టుకున్న విషయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారులకు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మెట్రాష్‌లో ఫిర్యాదు చేసే విధానం:

ముందుగా మెట్రాష్ యాప్‌ను తెరిచి 'Citizens' విభాగాన్ని ఎంచుకోవాలి. అనంతరం 'Report Loss of Qatari Documents' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పత్రం ఎక్కడ (ఏ దేశంలో) పోగొట్టుకుందో వివరాలు నమోదు చేయాలి. పోగొట్టుకున్న పత్రాన్ని ఎంపిక చేసి, దానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి. నమోదు చేసిన వివరాలను మరోసారి పరిశీలించి నిర్ధారించిన తర్వాత ఫిర్యాదును సమర్పించాలి.

పత్రాలు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా సంబంధిత అధికారులకు సమాచారం అందుతుందని, అందువల్ల ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని ఎంఓఐ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com