2028 నుంచి 2035 వరకు ICC మెన్స్ టోర్నీల పూర్తి షెడ్యూల్ విడుదల

- November 15, 2026 , by Maagulf
2028 నుంచి 2035 వరకు ICC మెన్స్ టోర్నీల పూర్తి షెడ్యూల్ విడుదల

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) రాబోయే ఎనిమిదేళ్ల కాలానికి గానూ మెన్స్ క్రికెట్ మెగా టోర్నీల క్యాలెండర్‌ను అధికారికంగా ఖరారు చేసింది. 2027 వన్డే వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా, ఆ తర్వాత 2028 నుంచి 2035 మధ్య జరగబోయే టోర్నమెంట్ల తేదీలు, వేదికల వివరాలను ఐసీసీ బోర్డు ప్రకటించింది. ఈ క్యాలెండర్‌లో భారత్‌కు రెండు ప్రధాన టోర్నీల ఆతిథ్య హక్కులు దక్కాయి.

భారత గడ్డ పై 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే వరల్డ్ కప్
ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత క్రికెట్ అభిమానులకు రెండు మెగా టోర్నీల విందు లభించనుంది. 2029లో వన్డే ఫార్మాట్‌లో జరిగే ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఒంటరిగా ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆ తర్వాత 2031 ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి బంగ్లాదేశ్‌తో కలిసి భారత్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుంది.


అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతాయి. 2028, 2030 టీ20 వరల్డ్ కప్ వేదికలు ఇవే2028 మెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 12 వరకు ఈ టోర్నీ సాగనుంది. ఇక 2030లో జరిగే మెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వేదికలు కానున్నాయి. జూలై 4 నుంచి ఆగస్టు 4 వరకు ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది.

డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్స్.. ఇంగ్లండ్‌ తర్వాత మార్పులు!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించి ఐసీసీ కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది. 2027 WTC ఫైనల్‌తో పాటు, 2029 (జూన్ 8–12), 2031 (జూన్ 12–16) సీజన్ల ఫైనల్స్‌కు కూడా ఇంగ్లాండ్ వేదికగా నిలవనుంది. అయితే 2033 నుంచి WTC ఫైనల్ వేదిక విషయంలో మార్పు ఉండనుంది. 2033 (జూన్ 9–13), 2035 (జూన్ 7–11) ఫైనల్ మ్యాచ్‌లకు వేదికలను ఐసీసీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. (డిఫెండింగ్ ఛాంపియన్ దేశంలో నిర్వహించే అవకాశం ఉందని క్రీడా వర్గాల అంచనా).

2032 నుంచి 2035 టోర్నీల తేదీలు ఖరారు..
వేదికలు పెండింగ్2032 నుంచి 2035 మధ్య జరగబోయే నాలుగు ప్రధాన ఐసీసీ టోర్నీల తేదీలను ప్రకటించినప్పటికీ, వాటికి ఆతిథ్యం ఇచ్చే దేశాలను ఐసీసీ ఇంకా నిర్ణయించలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి

  • 2032 టీ20 వరల్డ్ కప్: అక్టోబర్ 14 – నవంబర్ 14
  • 2033 ఛాంపియన్స్ ట్రోఫీ: అక్టోబర్ 2 – అక్టోబర్ 23
  • 2034 టీ20 వరల్డ్ కప్: జూలై 6 – ఆగస్టు 6
  • 2035 వన్డే వరల్డ్ కప్: అక్టోబర్ 2 – నవంబర్ 18
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com