కువైట్‌లో భారతీయుల కోసం కొత్త ప్రాపర్టీ యాప్..!!

- November 15, 2026 , by Maagulf
కువైట్‌లో భారతీయుల కోసం కొత్త ప్రాపర్టీ యాప్..!!

కువైట్: కువైట్‌లో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకునే భారతీయ కుటుంబాలు, ఉద్యోగులకు ఉపయోగపడేలా కొత్త ప్రాపర్టీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. కువైట్‌కు చెందిన ‘దల్లాల్’ (Dallal) సంస్థ ఉచిత వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఇళ్ల కోసం వెతికేవారు తమ అవసరాలకు అనుగుణంగా ప్రాపర్టీలను సులభంగా ఎంపిక చేసుకోవచ్చు.

ఇప్పటివరకు కువైట్‌లో చాలామంది సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ఇళ్లను వెతుకుతున్నారు. అయితే పాత ప్రకటనలు, సరైన సమాచారం లేని ఫొటోలు, అందుబాటులో లేని ఇళ్ల వివరాల కారణంగా అద్దెదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా దల్లాల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.

ఈ యాప్ పూర్తిగా ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఫ్యామిలీ భవనాలు, బ్యాచిలర్ భవనాలు, ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఉన్న ఇళ్లను ఫిల్టర్ల ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ప్రాపర్టీకి సమీపంలోని పాఠశాలలు, బస్‌స్టాప్‌లు, కిరాణా దుకాణాల వివరాలను కూడా చూడవచ్చు. సాల్మియా, హవల్లీ, ఫర్వానియా, మంగఫ్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల కోసం వెతికే వారికి ఈ సదుపాయాలు ఉపయోగపడనున్నాయి. 

యాప్ ప్రారంభ సమయంలోనే 1,000కు పైగా ధ్రువీకరించిన ప్రాపర్టీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో అపార్ట్‌మెంట్లు, ప్రైవేట్ ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య స్థలాలు, భూములు ఉన్నాయని దల్లాల్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలీ బహ్బహానీ తెలిపారు. 

దల్లాల్ యాప్‌ను Apple App Store, Google Play Store నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com