బహ్రెయిన్‌లో మోగిన ప్రమాద హెచ్చరిక సైరన్లు..!!

- November 15, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో మోగిన ప్రమాద హెచ్చరిక సైరన్లు..!!

మనామా: బహ్రెయిన్‌లో ఆదివారం (నవంబర్ 15) తెల్లవారుజామున ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) వరుసగా రెండు హెచ్చరికలు జారీ చేసింది.

దేశంలో ముప్పు పొంచి ఉందంటూ ప్రజలను అప్రమత్తం చేసిన మంత్రిత్వ శాఖ.. పౌరులు, నివాసితులు ప్రశాంతంగా ఉండాలని సూచించింది. వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అధికారిక సమాచార మార్గాల ద్వారా తాజా వివరాలను తెలుసుకోవాలని కోరింది.

అయితే, ఈ ముప్పు స్వరూపం ఏమిటనే విషయాన్ని మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. మరోవైపు, బహ్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లను దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు స్థానిక మీడియా తెలిపాయి. కాగా, అధికారిక ప్రకటనలు వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com