అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న ఎయిర్ అరేబియా దమ్మామ్..
- November 16, 2026
షార్జా: సౌదీ అరేబియాలోని కొత్త జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ అరేబియా దమ్మామ్ (Air Arabia Dammam) తన అంతర్జాతీయ విమాన సర్వీసుల నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా దమ్మామ్ నుంచి సిరియా రాజధాని డమాస్కస్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
2026 నవంబర్ 20 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి నాలుగు రోజుల పాటు దమ్మామ్–డమాస్కస్ మధ్య నాన్‌స్టాప్ విమానాలను నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ సందర్భంగా ఎయిర్ అరేబియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదెల్ అల్ అలీ మాట్లాడుతూ.. తూర్పు సౌదీ అరేబియా ప్రాంతంలోని ప్రయాణికులకు నమ్మకమైన, సరసమైన ధరల్లో నేరుగా విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో డమాస్కస్‌ను తమ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో చేర్చినట్లు తెలిపారు.
సౌదీ అరేబియాలోని వివిధ నగరాలతో పాటు అంతర్జాతీయంగా మరిన్ని గమ్యస్థానాలకు విమాన సర్వీసులను విస్తరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన కనెక్టివిటీ కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
దమ్మామ్ నుంచి డమాస్కస్‌కు కొత్త విమాన సర్వీసుల ద్వారా ప్రయాణికులకు మరిన్ని ప్రయాణ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, కొత్త సర్వీసుల్లో ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నామని ఆదెల్ అల్ అలీ తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న ఎయిర్ అరేబియా దమ్మామ్..
- దుబాయ్‌లో అనంతపురం మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం
- ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు కొత్త డీజీ..బాధ్యతలు చేపట్టిన సౌమ్య మిశ్రా
- ఛత్తీస్‌గఢ్‌లో కబ్రా కాన్ ఏనుగు బీభత్సం..16 మంది మృతి
- విజయవాడలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల వేడుక..
- అమెరికా యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థుల దెబ్బ..
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు షేక్ నహ్యాన్‌కు మంత్రి అజారుద్దీన్ ఆహ్వానం
- విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం
- ఖతార్ పాఠశాలల్లో వేధింపులకు చెక్..!!
- ఒమన్‌లో కొత్త ఆరోగ్య సముదాయం ప్రారంభం..!!







