ఒమన్‌లో కొత్త ఆరోగ్య సముదాయం ప్రారంభం..!!
- November 16, 2026
ఇబ్రా: ఒమన్‌లోని నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో నార్త్ ఇబ్రా హెల్త్ కాంప్లెక్స్‌ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇబ్రా విలాయత్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య సముదాయం ద్వారా 25కిపైగా గ్రామాలు, నివాస ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒమన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్లా బిన్ సలీమ్ అల్ హార్తీ ముఖ్య అతిథిగా హాజరై ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య వ్యవహారాల అండర్ సెక్రటరీ డాక్టర్ సయీద్ బిన్ హరబ్ అల్ లమ్కీతో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు. దేశంలో వైద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రణాళికలో ఈ ప్రాజెక్టు భాగమని అధికారులు తెలిపారు. ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, నాణ్యమైన, సమగ్ర వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ హెల్త్ కాంప్లెక్స్ నిర్మాణానికి మొత్తం RO1,616,892 ఖర్చు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత సులభంగా అందనున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పాఠశాలల్లో వేధింపులకు చెక్..!!
- ఒమన్‌లో కొత్త ఆరోగ్య సముదాయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కా గ్రాండ్ మసీదులో ఉచిత సేఫ్టీ బ్రేస్లెట్లు..!!
- యూఏఈలో 2027లో తగ్గనున్న కొత్త నియామకాలు..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల చేపల విక్రయాలపై నిషేధం..!!
- బహ్రెయిన్‌లో హౌసింగ్ ఫైనాన్సింగ్‌కు భారీ స్పందన..!!
- సౌదీ అరేబియాలో బోస్ స్పీకర్లు రీకాల్..!!
- కువైట్‌లో వాహన బీమా పాలసీలకు కొత్త నిబంధనలు..!!
- ఖతార్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!







