తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు షేక్ నహ్యాన్‌కు మంత్రి అజారుద్దీన్ ఆహ్వానం
- November 16, 2026
అబుదాబి: యూఏఈ టాలరెన్స్ అండ్ కోఎగ్జిస్టెన్స్ శాఖ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్‌తో తెలంగాణ ప్రతినిధి బృందం అబుదాబిలో ఆత్మీయంగా సమావేశమైంది.
ఈ సందర్భంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు తెలంగాణలో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026’కు హాజరుకావాల్సిందిగా షేక్ నహ్యాన్‌ను మంత్రి అజాహురుద్దీన్ ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులు, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా షేక్ నహ్యాన్ కోసం క్రికెట్ బ్యాట్ పై సంతకం చేసి అందించారు. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక ఇన్నింగ్స్ ప్రారంభం కానుందని, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఆయనను తెలంగాణలో స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, సాంకేతిక ఆవిష్కరణలకు గమ్యస్థానంగా నిలబెట్టే లక్ష్యంతో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. యూఏఈతో తెలంగాణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- అమెరికా యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థుల దెబ్బ..
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు షేక్ నహ్యాన్‌కు మంత్రి అజారుద్దీన్ ఆహ్వానం
- విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం
- ఖతార్ పాఠశాలల్లో వేధింపులకు చెక్..!!
- ఒమన్‌లో కొత్త ఆరోగ్య సముదాయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కా గ్రాండ్ మసీదులో ఉచిత సేఫ్టీ బ్రేస్లెట్లు..!!
- యూఏఈలో 2027లో తగ్గనున్న కొత్త నియామకాలు..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల చేపల విక్రయాలపై నిషేధం..!!
- బహ్రెయిన్‌లో హౌసింగ్ ఫైనాన్సింగ్‌కు భారీ స్పందన..!!







