దుబాయ్‌లో అనంతపురం మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం
- November 16, 2026
యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
దుబాయ్: అనంతపురం నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన చిట్లూరు రమేష్ గౌడ్ దుబాయ్ పర్యటన సందర్భంగా యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆత్మీయ సమ్మేళనంతో పాటు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా, బీసీ అసోసియేషన్స్ జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, విద్యావేత్తగా రమేష్ గౌడ్ విశేష గుర్తింపు పొందారని నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సమయంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులు, రాజకీయ ఒత్తిళ్లు, అక్రమాలు, రిగ్గింగ్ ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొంటూ తన రాజకీయ నిబద్ధతను చాటుకున్నారని కొనియాడారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించిన రమేష్ గౌడ్ పట్టుదల, పోరాట స్ఫూర్తి అభినందనీయమని అన్నారు.
ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసంతో, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన నమ్మకాలకు కట్టుబడి నిలబడిన ఆయన రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమాన్ని యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి, రామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి, రామ్, రెడ్డయ్య రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిలాన్ బాషా, తరపట్ల మోహన్, జహీర్, కోటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సోమశేఖర్, వేండ్ర శ్రీనివాస్, విజయ భాస్కర్, ఫహీం, హనుమంతు రెడ్డి, అబ్దుల్లా, వెంకట రమణా రెడ్డి, మనోహర్, నరేష్ చౌదరి, అక్రమ్, చక్రి, సుధాకర్ రెడ్డి, ఖలీల్, రాజా రెడ్డి, సురేష్, తారక్, భరత్, గణపతి రాజు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
దుబాయ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యతను, పరస్పర స్నేహభావాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ సందర్భంగా రమేష్ గౌడ్‌కు నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అనంతపురం మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం
- ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు కొత్త డీజీ..బాధ్యతలు చేపట్టిన సౌమ్య మిశ్రా
- ఛత్తీస్‌గఢ్‌లో కబ్రా కాన్ ఏనుగు బీభత్సం..16 మంది మృతి
- విజయవాడలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల వేడుక..
- అమెరికా యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థుల దెబ్బ..
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు షేక్ నహ్యాన్‌కు మంత్రి అజారుద్దీన్ ఆహ్వానం
- విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం
- ఖతార్ పాఠశాలల్లో వేధింపులకు చెక్..!!
- ఒమన్‌లో కొత్త ఆరోగ్య సముదాయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!







