ఒమన్‌లో కీలక రహదారులపై ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!

- November 17, 2026 , by Maagulf
ఒమన్‌లో కీలక రహదారులపై ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!

మస్కట్: ఒమన్‌లోని పలు ప్రధాన రహదారులపై ట్రక్కుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ విభాగంలోని రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

ఆంక్షలు అమలయ్యే రహదారులు:

* సుల్తాన్ థువైనీ బిన్ సయీద్ రోడ్డులో అల్ సహ్వా టవర్ రౌండ్‌అబౌట్ నుంచి అల్ దఖిలియా గవర్నరేట్ వైపు వెళ్లే మార్గం.

* ఇజ్కీ – సినావ్ రహదారి (రెండు వైపులా).

* ఇజ్కీ – నిజ్వా రహదారి (రెండు వైపులా).

నిర్దేశించిన సమయాల్లో ఈ మార్గాల్లో ట్రక్కుల రాకపోకలు నిలిపివేస్తామని ROP స్పష్టం చేసింది. వాహనదారులు, ముఖ్యంగా ట్రక్కుల డ్రైవర్లు ఈ ఆంక్షలను గమనించి తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com