సౌదీలో కార్మికులను ఇతరులకు అప్పగిస్తే.. యజమానులకు 6 నెలల జైలు..!!

- November 17, 2026 , by Maagulf
సౌదీలో కార్మికులను ఇతరులకు అప్పగిస్తే.. యజమానులకు 6 నెలల జైలు..!!

రియాద్: సౌదీ అరేబియాలో తమ వద్ద పనిచేస్తున్న కార్మికులను ఇతర యజమానుల వద్ద పనిచేయడానికి లేదా సొంతంగా పని చేసుకునేందుకు అనుమతించే వ్యక్తిగత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన యజమానులకు గరిష్ఠంగా SR100,000 జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాకుండా ఐదేళ్ల వరకు కొత్తగా కార్మికులను నియమించుకోకుండా నిషేధం విధించవచ్చని స్పష్టం చేసింది.

నిబంధనలు పాటించాలని సూచన

నివాస అనుమతులు, కార్మిక చట్టాలు, సరిహద్దు భద్రతకు సంబంధించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరింది. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో ఉల్లంఘనలను గుర్తిస్తే 911 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది. సౌదీలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు 999 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com