కువైట్లో మారనున్న జ్లీబ్ అల్ షుయూఖ్ రూపురేఖలు..!!
- November 19, 2026
కువైట్ : కువైట్లోని ప్రవాస భారతీయులు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఒకటైన జ్లీబ్ అల్ షుయూఖ్లో భారీ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ ప్రాంతంలోని అక్రమ నివాసాలు, ఆక్రమణలను తొలగించే పనులు పూర్తయిన తర్వాత ఆధునిక, సుస్థిర పట్టణ అభివృద్ధి ప్రాజెక్టుగా తీర్చిదిద్దనున్నట్లు ఫర్వానియా గవర్నర్ షేక్ అథ్బీ అల్ నాసర్ వెల్లడించారు.
ఈ ప్రాంతంలో కొనసాగుతున్న కూల్చివేత పనుల పురోగతిని పరిశీలించేందుకు గవర్నర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఫర్వానియా గవర్నరేట్ మున్సిపాలిటీ డైరెక్టర్ ఇంజినీర్ నవాఫ్ అల్ కందరీ, కువైట్ మున్సిపాలిటీ సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యుడు మహమ్మద్ అల్ జలావీ, జ్లీబ్ ప్రాంత కమాండర్ కల్నల్ మహమ్మద్ అల్ అంజీతో పాటు అంతర్గత వ్యవహారాల శాఖ, కువైట్ మున్సిపాలిటీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
అక్రమ నివాస ప్రాంతాల తొలగింపులో సంబంధిత ప్రభుత్వ శాఖలు చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. త్వరలోనే ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ అభివృద్ధి, సుస్థిర ప్రాజెక్టుల్లో ఒకటిగా మారుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. జ్లీబ్ అల్ షుయూఖ్లో చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేందుకు కూల్చివేతలు, తొలగింపు చర్యలు చారిత్రాత్మక ముందడుగని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని షేక్ అహ్మద్ అల్ అబ్దుల్లా నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా గవర్నర్ అభినందించారు. రాజకీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను నిరంతరం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా, కువైట్ ప్రతిష్ఠను ప్రతిబింబించేలా జ్లీబ్ అల్ షుయూఖ్ను ఆధునిక సౌకర్యాలతో కూడిన సుస్థిర పట్టణ అభివృద్ధి ప్రాజెక్టుగా మార్చడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. రస్ అల్ ఖైమా, ఫుజైరాలో ప్రవహించిన వాడీలు..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి.. ఇటలీకి సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- ఇజ్రాయెల్ తో భారత్ భారీ డీల్
- ఏఐ, డిజిటల్ భద్రత, స్మార్ట్ రవాణా.. బహ్రెయిన్–అమెరికా కీలక చర్చలు..!!
- కువైట్లో మారనున్న జ్లీబ్ అల్ షుయూఖ్ రూపురేఖలు..!!
- ఖతార్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!
- అల్ జబల్ అల్ అఖ్దర్ మొక్కలతో కొత్త ఉత్పత్తులు..!!
- ఒమన్ నేషనల్ డే సందర్భంగా 4,000 మంది ఒమన్ పౌరులకు గ్లోబల్ విలేజ్లో ఉచిత ప్రవేశం
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోలింగ్ ఫ్లీట్లోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్
- తాయిఫ్ గవర్నర్తో భారత కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి భేటీ







