ఆఫ్గానిస్థాన్‌లో వరుస పేలుళ్లు తొమ్మిది మంది పౌరులు మృతి
- August 29, 2016
ఆఫ్గానిస్థాన్‌లో సోమవారం వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తాలిబన్ తిరుగుబాటుదారులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతమైన హెల్మంద్ రాష్ట్రంలో తొలుత బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు.
కాగా.. ఘోర్ ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుళ్లకు సంబంధించిన ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
అయితే భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్ తిరుగుబాటుదారులు తరచుగా రోడ్ల పక్కన బాంబులు పెడుతుంటారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







